Somesekhar
సూర్యకుమార్ యాదవ్ కు సంబంధించిన ఓ వీడియో ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపింది. ఇటు టీమిండియా ఫ్యాన్స్ తో పాటుగా ముంబై అభిమానులకు ఆ వీడియో తెగ ఆనందాన్ని తెచ్చిపెట్టింది.
సూర్యకుమార్ యాదవ్ కు సంబంధించిన ఓ వీడియో ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపింది. ఇటు టీమిండియా ఫ్యాన్స్ తో పాటుగా ముంబై అభిమానులకు ఆ వీడియో తెగ ఆనందాన్ని తెచ్చిపెట్టింది.
Somesekhar
దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాలు బెణకడంతో.. ఆ నొప్పితో వెంటనే గ్రౌండ్ ను వీడాడు సూర్య. అయితే ఆ గాయం పెద్దది కాదని సూర్యతో పాటుగా అందరూ భావించారు. కానీ స్కానింగ్ చేయించుకున్న తర్వాత తెలిసింది గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని. దీంతో సూర్య దాదాపు 7 వారాలు క్రికెట్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇక ఈ గాయం కారణంగా జనవరిలో ఆఫ్గాన్ తో జరిగే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు దూరం కానున్నాడు సూర్య భాయ్. ఈ నేపథ్యంలో సూర్యకు సంబంధించిన ఓ వీడియో ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపింది. ఇటు టీమిండియా ఫ్యాన్స్ తో పాటుగా ముంబై అభిమానులకు ఆ వీడియో తెగ ఆనందాన్ని తెచ్చిపెట్టింది.
సూర్య కుమార్ యాదవ్.. టీమిండియా క్రికెట్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ బ్యాటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. క్రికెట్ చరిత్రలో తనకే సాధ్యమైన షాట్స్ ఆడుతూ.. మిస్టర్ 360 ప్లేయర్ గా అవతరించాడు. ఇక తన ఆటతీరుతో టీ20 ఫార్మాట్ కు కెప్టెన్ గా ఎదిగాడు ఈ చిచ్చర పిడుగు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. సూర్యకుమార్ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో గాయపడిన విషయం తెలిసిందే. ఇక ఈ గాయం కారణంగా దాదాపు 7 వారాలు క్రికెట్ కు దూరం కానున్నాడు సూర్య భాయ్. ఈ వార్త అతడి అభిమానులతో పాటుగా ఇటు ముంబై ఫ్యాన్స్ కు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఇదిలా ఉండగా.. సూర్యకుమార్ తాజా వీడియో ఒకటి ఫ్యాన్స్ ను తెగ సంతోష పరుస్తోంది. ఆ వీడియోలో సూర్య కాలికి కట్టు వేసుకుని, కర్ర సాయంతో నడుస్తున్నాడు. స్పీడ్ గా రికవరీ అవుతూ.. ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడదామా అని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. ఇటు టీమిండియా ఫ్యాన్స్ తో పాటుగా ముంబై ఇండియన్స్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఐపీఎల్ ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో గాయం నుంచి కోలుకుని సమరానికి సిద్దం కావాలని భావిస్తున్నారు ఎంఐ ఫ్యాన్స్. ప్రస్తుతం సూర్య బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడని, అక్కడే కొన్ని రోజులు చికిత్స తీసుకుంటాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
Get well soon, Suryakumar Yadav!pic.twitter.com/Cn8wtVwg2p
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 23, 2023