బార్బడోస్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు, సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. పాండ్యా వివాదాస్పద రనౌట్ తో పాటుగా రోహిత్ శర్మ శార్ధూల్ ఠాకూర్ ను తిట్టడం లాంటి సంఘటనలు ఈ మ్యాచ్ లో జరిగాయి. వీటితో పాటుగా మరో ఫన్నీ మూమెంట్ జరిగింది. ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన టీమిండియా మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్.. సంజూ శాంసన్ జెర్సీతో బరిలోకి దిగాడు. దాంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే అతడు శాంసన్ జెర్సీ ధరించడానికి కారణం తెలిస్తే నవ్వాల్సిందే! ప్రస్తుతం సూర్యకుమార్ అతడి జెర్సీ ధరించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
సూర్యకుమార్ యాదవ్.. వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో 25 బంతుల్లో 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తక్కువ పరుగులే చేసి ఔట్ అయినప్పటికీ ఈ మ్యాచ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు సూర్య భాయ్. దానికి కారణం అతడు వేసుకున్న టీమిండియా జెర్సీనే. ఇటీవలే టీమిండియా జెర్సీలను మార్చింది బీసీసీఐ. దాంతో ఆటగాళ్లందరికి కొత్త జెర్సీలను అందించింది. ఈ క్రమంలోనే సూర్య కుమార్ కు అందించిన జెర్సీ అతడికి ఫుల్ టైట్ అయ్యింది. సూర్యకుమార్ కు లార్జ్ సైజ్ జెర్సీ కావాల్సి ఉండగా.. అతడికి మీడియం సైజ్ జెర్సీని ఇచ్చారు. అది అతడికి ఫుల్ టైట్ ఉండటంతో.. టీమిండియా ఆటగాడు అయిన సంజూ శాంసన్ జెర్సీని అడిగి తీసుకున్నాడు SKY.
అయితే నిబంధనల ప్రకారం జెర్సీ పై ఉన్న పేరు కనబడకుండా టేప్ వేయడానికి ఆస్కారం లేదు. దాంతో అదే జెర్సీతోనే ఫొటో షూట్ కు వచ్చాడు సూర్యకుమార్. ఇక తన జెర్సీ గురించి మేనేజ్ మెంట్ తో చెప్పాడు. దానికి స్పందించిన టీమ్ మేనేజ్ మెంట్ అతడి కొత్త జెర్సీని అందిస్తామని చెప్పుకొచ్చింది. అయితే రెండో వన్డే తర్వాతనే అతడికి ఈ జెర్సీ అందుతుందని, అప్పటి వరకు అతడు సహచర ఆటగాళ్ల జెర్సీతోనే ఆడాలని పేర్కొంది. కాగా.. ఇలా ఇతర ఆటగాళ్ల జెర్సీలతో ఆడటం ఇదే మెుదటిసారి కాదు. గతంలో చాలా మంది ఇతర ఆటగాళ్ల జెర్సీలతో బరిలోకి దిగిన సందర్బాలు అనేకం ఉన్నాయి.
Some fans saying Suryakumar was protesting against management.
But now BCCI tells the reason behind it!
Read Full news Here 👇https://t.co/XGVegupuHD— Sportstime247 (@sportstime_247) July 28, 2023