iDreamPost
android-app
ios-app

హార్దిక్​ పాండ్యాకు ముంబై షాక్! MI కొత్త కెప్టెన్​గా మరో టీమిండియా స్టార్?

  • Published Sep 17, 2024 | 5:15 PM Updated Updated Sep 17, 2024 | 5:15 PM

Suryakumar Yadav To Captain Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడికి ఝలక్ ఇచ్చిందని వినిపిస్తోంది. అతడి ప్లేస్​లో మరో టీమిండియా స్టార్​ను కెప్టెన్​గా నియమించాలని డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది.

Suryakumar Yadav To Captain Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడికి ఝలక్ ఇచ్చిందని వినిపిస్తోంది. అతడి ప్లేస్​లో మరో టీమిండియా స్టార్​ను కెప్టెన్​గా నియమించాలని డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది.

  • Published Sep 17, 2024 | 5:15 PMUpdated Sep 17, 2024 | 5:15 PM
హార్దిక్​ పాండ్యాకు ముంబై షాక్! MI కొత్త కెప్టెన్​గా మరో టీమిండియా స్టార్?

ఐపీఎల్-2025కు ఇంకా చాలా సమయం ఉంది. ఈ సీజన్​కు ముందు నిర్వహించే మెగా ఆక్షన్​ కూడా ఇప్పట్లో లేదు. ఈ ఏడాది ఆఖర్లో జరగనుంది వేలం. అయితే ఇప్పటి నుంచే టీమ్స్ అన్నీ ఆక్షన్​లో ఏయే ప్లేయర్లను తీసుకోవాలి? ప్రస్తుతం జట్టులో ఉన్న వారిలో ఎవర్ని వదులుకోవాలి అంటూ మార్పులపై ఫోకస్ పెట్టాయి. కొన్ని టీమ్స్ కెప్టెన్స్​ను ఛేంజ్ చేస్తుండగా.. మరికొన్ని కోచ్​లకు గుడ్​బై చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పాపులర్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కూడా కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తమ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ ఇచ్చిందని సమాచారం. అతడ్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పిచేందుకు రంగం సిద్ధం చేసిందట. పాండ్యా ప్లేస్​లో మరో టీమిండియా స్టార్​ను కెప్టెన్​గా నియమించాలని ఎంఐ డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​ను కెప్టెన్​గా నియమించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ఊపందుకున్నాయని తెలుస్తోంది. ఒకవేళ సూర్య టీమ్​ను వీడి మెగా ఆక్షన్​లో పాల్గొనాలని డిసైడ్ అయితే మరో సీనియర్ ప్లేయర్ జస్​ప్రీత్ బుమ్రాకు సారథ్య పగ్గాలు అప్పగించాలని ఎంఐ ఓనర్స్ అనుకుంటున్నారట. కెప్టెన్సీ విషయంపై ఇప్పటికే హార్దిక్​కు క్లారిటీ ఇచ్చేశారని.. ఇక మీదట అతడు ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతాడని వినిపిస్తోంది. హార్దిక్​ను కెప్టెన్సీ నుంచి తీసేయడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

గుజరాత్ టైటాన్స్​కు కెప్టెన్​గా సక్సెస్ అయిన హార్దిక్​ను గతేడాది మినీ ఆక్షన్​లో టీమ్​లోకి తీసుకొచ్చింది ముంబై. భారీ ధర పెట్టి అతడ్ని సొంతం చేసుకుంది. జీటీలాగే ఎంఐని కూడా సక్సెస్​ఫుల్​గా నడిపిస్తాడని గంపెడాశలు పెట్టుకుంది. అయితే హార్దిక్ విఫలమయ్యాడు. అటు బ్యాటర్​గా, బౌలర్​గా ఫెయిల్ అవడమే గాక చెత్త కెప్టెన్సీతోనూ విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో అతడ్ని ఆ పోస్ట్​లో నుంచి తీసేయాలని ఎంఐ ఓనర్స్ ఫిక్స్ అయ్యారట. గుజరాత్ నుంచి ఎంఐకి వచ్చిన హార్దిక్​ కాంట్రాక్ట్ కూడా ఒక ఏడాదేనని అంటున్నారు. అందుకే అతడ్ని కెప్టెన్సీ నుంచి తీసేసి సూర్యకు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట. ఒకవేళ ఇదే జరిగితే పాండ్యా ఆ అవమానాన్ని ఎలా తట్టుకుంటాడో చూడాలి. అయితే కెప్టెన్సీ మార్పు మీద ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. మరి.. ఎంఐకి ఎవరు కెప్టెన్​గా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.