iDreamPost
android-app
ios-app

Virat Kohli: విరాట్ కోహ్లీకి చెమటలు పట్టించిన బుమ్రా! పేస్ గన్ తో మామూలుగా ఉండదు..

  • Published Sep 17, 2024 | 4:40 PM Updated Updated Sep 17, 2024 | 4:40 PM

Virat Kohli struggles in Jasprit Bumrah bowling: ప్రాక్టీస్ లో భాగంగా కింగ్ విరాట్ కోహ్లీకి చుక్కలు చూపించాడు స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా. తన మార్క్ బంతులతో ఇబ్బందులు పెట్టాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Virat Kohli struggles in Jasprit Bumrah bowling: ప్రాక్టీస్ లో భాగంగా కింగ్ విరాట్ కోహ్లీకి చుక్కలు చూపించాడు స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా. తన మార్క్ బంతులతో ఇబ్బందులు పెట్టాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Virat Kohli: విరాట్ కోహ్లీకి చెమటలు పట్టించిన బుమ్రా! పేస్ గన్ తో మామూలుగా ఉండదు..

టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మరో రెండు రోజుల్లో టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ స్టార్ట్ అవ్వనుంది. ఇక ఇందు కోసం ఇరు జట్లు ఇప్పటికే చెన్నై చేరుకుని ప్రాక్టీస్ మెుదలుపెట్టాయి. మరీ ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో చెమటోడుస్తున్నారు. పాక్ ను చిత్తు చేసి మంచి ఊపు మీదున్న బంగ్లాదేశ్ ను అంత తేలిగ్గా తీసుకోట్లేదని ప్రాక్టీస్ ను బట్టే అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో కింగ్ విరాట్ కోహ్లీకి చుక్కలు చూపించాడు స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది టీమిండియా. బంగ్లాదేశ్ కంటే ముందుగానే చెన్నై చేరుకుని కఠోరంగా ప్రాక్టీస్ మెుదలుపెట్టింది. ఇక సోమవారం ప్రాక్టీస్ లో భాగంగా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీకి చెమటలు పట్టించాడు జస్ప్రీత్ బుమ్రా. బుమ్రాను ఎదుర్కొవడంలో విరాట్ తీవ్రంగా ఇబ్బంది పడినట్లు స్పోర్ట్ స్టార్ తన కథనంలో పేర్కొంది. ఎర్ర నేల పిచ్ పై ఏస్ పేసర్ బుమ్రా చెలరేగినట్లు తెలుస్తోంది. ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్ లతో కోహ్లీని తీవ్ర ఇబ్బందులు పెట్టాడు. ఒకటి రెండు సార్లు బౌల్డ్ చేయడమే కాకుండా.. ఎక్కువగా అతడి స్ట్రాప్స్ అండ్ ప్యాడ్స్ కు తాకేలా బంతులు సంధించాడు. దాంతో పేస్ గన్ తో మామూలుగా ఉండదు అంటూ బుమ్రా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విరాట్ కోహ్లీ కేవలం బుమ్రా బౌలింగ్ లోనే కాకుండా.. టీమిండియా ప్రత్యేకంగా నియమించుకున్న ఆరడుగుల బౌలర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్ ను కూడా ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. అతడి బౌన్సర్లకు ధీటైన ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. కాగా.. టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ బంగ్లతో సిరీస్ కోసమే వీళ్లిద్దరు ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. అయితే బుమ్రాను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ కోహ్లీ.. స్పిన్ లో మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అశ్విన్ బౌలింగ్ లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్ కు డ్రెస్సింగ్ రూమ్ గోడ బద్దలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా.. బ్రార్ ను ప్రధానంగా నహీద్ రానా బౌలింగ్ ను ఎలా అటాక్ చేయాలి అన్న గేమ్ ప్లాన్ లో భాగంగానే నెట్ బౌలర్ గా ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఇక మరోవైపు బంగ్లాదేశ్ కూడా టీమిండియాపై తొలి విజయం సాధించాలని ఊవ్విళ్లూరుతోంది. అందుకోసం స్పిన్నర్లను బరిలోకి దింపాలని భావిస్తోంది. అలాగే 21 ఏళ్ల యంగ్ పేసర్ నహీద్ రానా బంగ్లా తురుపు ముక్కగా ఉపయోగించుకోవాలని ప్లాన్స్ గీస్తోంది. మరి బుమ్రా బౌలింగ్ లో కోహ్లీ ఇబ్బంది పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.