Nidhan
Suryakumar Yadav, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న ఓ టీమిండియా స్టార్‌కు గాయమైంది. టోర్నమెంట్ మొదలవడానికి ముందే అతడు దూరమయ్యాడు.
Suryakumar Yadav, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న ఓ టీమిండియా స్టార్‌కు గాయమైంది. టోర్నమెంట్ మొదలవడానికి ముందే అతడు దూరమయ్యాడు.
Nidhan
టీమిండియాకు ఇప్పుడు మ్యాచ్‌లు లేకపోవడంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా డొమెస్టిక్ క్రికెట్ వైపు షిఫ్ట్ అయింది. దీనికి కారణం నేషనల్ డ్యూటీ లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధన తీసుకురావడమే. దులీప్ ట్రోఫీ-2024 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. అందుకే ఈ టోర్నమెంట్లో ఆడేందుకు భారత స్టార్లంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీమ్స్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఫిట్నెస్ను మెరుగుపర్చుకుంటూనే ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టైమ్‌లో ఓ టీమిండియా స్టార్‌కు గాయమైంది. దీంతో అతడు ఆ టోర్నీకి దూరమయ్యాడు. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఇంజ్యురీ అయింది. దులీప్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతున్న స్కై చేతికి గాయమైంది. గత వారం బుచ్చిబాబు టోర్నమెంట్లో భాగంగా టీఎన్ఏసీ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడికి ఇంజ్యురీ అయింది. ఈ కారణంతోనే ఆట ఆఖరి రోజు అతడు బరిలోకి దిగలేదని తెలిసింది. ఇంకా కోలుకోకపోవడంతో దులీప్ ట్రోఫీ ఆరంభ మ్యాచులకు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఇండియా సీ-ఇండియా డీ మధ్య జరగనున్న మ్యాచ్‌కు సూర్య దూరం కానున్నాడు. గాయంతో బాధపడుతున్న స్కై.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడని తెలుస్తోంది.
సూర్యకు అయిన గాయం తీవ్రత ఎంతనేది ఇంకా తెలియరాలేదు. ఇంజ్యురీ చిన్నదే అయితే ఇబ్బందేం లేదు. కానీ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం ఇబ్బందే. ఇక, శ్రీలంక సిరీస్ నుంచి సూర్యకుమార్‌కు టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు. ఇక మీదట అతడు పొట్టి ఫార్మాట్‌కే పరిమితం అవుతాడని.. వన్డేలు, టెస్టులకు దూరంగా ఉంటాడని స్పష్టం చేశారు. అయితే స్కై మాత్రం లాంగ్ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది తన డ్రీమ్ అని.. టెస్టుల్లో రాణించడంపై ఫోకస్ చేస్తున్నానని అంటున్నాడు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు టోర్నీలో పాల్గొన్న మిస్టర్ 360.. దులీప్ ట్రోఫీలోనూ దుమ్మురేపాలని అనుకున్నాడు. ఆ టోర్నీలో రాణించి టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. ఈ తరుణంలో గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచులకు దూరమయ్యాడు. మరి.. సూర్యను టెస్టుల్లో ఆడితే చూడాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Suryakumar Yadav ruled out of the first round of the Duleep Trophy due to a hand injury. (Espncricinfo). pic.twitter.com/NAenKK2Obj
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2024