iDreamPost
android-app
ios-app

ఇషాంత్ సూపర్ స్పెల్​కు 16 ఏళ్లు.. అందర్నీ భయపెట్టే పాంటింగ్​నే వణికించాడు!

  • Published Sep 02, 2024 | 8:12 PM Updated Updated Sep 02, 2024 | 8:12 PM

Ishant Sharma, Ricky Ponting, IND vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్ ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. కెప్టెన్​గా, బ్యాటర్​గా కంగారూలను విజయాల బాటలో నడిపిస్తున్న లెజెండ్ రికీ పాంటింగ్​కు భయం ఏంటో రుచి చూపించాడో భారత బౌలర్.

Ishant Sharma, Ricky Ponting, IND vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్ ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. కెప్టెన్​గా, బ్యాటర్​గా కంగారూలను విజయాల బాటలో నడిపిస్తున్న లెజెండ్ రికీ పాంటింగ్​కు భయం ఏంటో రుచి చూపించాడో భారత బౌలర్.

  • Published Sep 02, 2024 | 8:12 PMUpdated Sep 02, 2024 | 8:12 PM
ఇషాంత్ సూపర్ స్పెల్​కు 16 ఏళ్లు.. అందర్నీ భయపెట్టే పాంటింగ్​నే వణికించాడు!

రికీ పాంటింగ్.. ఈ పేరు వింటేనే అప్పట్లో అపోజిషన్ టీమ్స్ వణికిపోయేవి. 1990వ దశకం చివరి నుంచి 2000వ దశకం ఆఖరి వరకు ఓ పదేళ్ల పాటు అతడి హవా నడిచింది. బ్యాటర్​గా, కెప్టెన్​గా అతడు ఎంతో దూకుడుగా ఉండేవాడు. కెప్టెన్​గా ఫుల్ డామినేషన్ చూపించేవాడు. బ్యాట్ పట్టుకొని క్రీజులోకి దిగాడా.. బౌలర్లపై అటాకింగ్ చేస్తూ మ్యాచ్​ను సింగిల్ హ్యాండ్​తో లాక్కునేవాడు. అందుకే చాలా టీమ్స్​కు అతడో విలన్​లా కనిపించేవాడు. అతడితో పెట్టుకోవాలంటేనే అందరూ భయపడేవారు. పాంటింగ్​కు బౌలింగ్ చేయాలంటేనే అపోజిషన్ టీమ్ బౌలర్లు వణికిపోయేవారు. అలాంటోడ్ని ఓ భారత బౌలర్ ఫస్ట్ టైమ్ భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. అందర్నీ భయపెట్టినోడ్ని వణికించాడు. పాంటింగ్ పొగరును అణిచాడు. ఇది జరిగి 16 ఏళ్లు కావొస్తోంది.

భయం అంటే ఏంటో తెలియని పాంటింగ్​కు దాని రుచి చూపించాడు టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ. అది 2008వ సంవత్సరం. భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్. వాకా స్టేడియంలో మ్యాచ్. భారత్​ను మడతబెట్టాలని ఆసీస్ డిసైడ్ అయింది. కానీ మన జట్టును చిత్తు చేయాలని అనుకున్న పాంటింగ్​కు 17 ఏళ్ల ఇషాంత్​ చుక్కలు చూపించాడు. నిఖార్సయిన పేస్ బౌలింగ్​తో ముచ్చెమటలు పట్టించాడు. 140 కిలోమీటర్లకు తగ్గని వేగంతో నిలకడగా బంతులు సంధిస్తూ పాంటింగ్​కు పోయించాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ క్రీజులో నిలబడాలంటేనే వణికిపోయేలా చేశాడు ఇషాంత్. ఇన్​స్వింగర్లను ఆడటంలో ఆసీస్ సారథికి ఉన్న వీక్​నెస్​ను టార్గెట్ చేసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు.

పాంటింగ్ కాళ్లను టార్గెట్ చేసుకొని వరుసగా ఇన్​స్వింగర్లు వేస్తూ ఇబ్బంది పెట్టిన ఇషాంత్.. ఆ తర్వాత ఔట్ స్వింగర్లతో అతడ్ని మరింత కన్​ఫ్యూజ్ చేశాడు. అతడి ధాటిని తట్టుకోలేక అతడు వణికిపోయాడు. ఆ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ పాంటింగ్​ను ఇషాంతే ఔట్ చేయడం విశేషం. ఆ మ్యాచ్​లో భారత్ 72 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. అప్పటివరకు ఎదురులేని బ్యాటింగ్​తో హవా నడిపించిన పాంటింగ్​కు ఇషాంత్ భయం పట్టుకుంది. ఆ మ్యాచ్​తో పాటు ఇంకా చాలా సిరీస్​ల్లో ఆసీస్ లెజెండ్​ను భారత స్పీడ్​స్టర్ భయపెట్టాడు. పాంటింగ్ బ్యాటింగ్​కు రాగానే ఇషాంత్​ చేతికి బాల్ ఇచ్చేవాళ్లు. ఒక వెలుగు వెలిగిన కంగారూ దిగ్గజం తన కెరీర్ ఆఖరి రోజుల్లో ఇషాంత్​ను ఎదుర్కోలేక చతికిలపడ్డాడు. మహా మహా బౌలర్లను బాదినోడు భారత పేసర్ దెబ్బకు పరుగులు చేయలేక తీవ్రంగా నిరాశపర్చాడు. అందుకే అటు పాంటింగ్, ఆసీస్ ఫ్యాన్స్​తో పాటు ఇటు భారత అభిమానులు కూడా ఇషాంత్ సూపర్ స్పెల్​ను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇవాళ అతడి బర్త్ డే కావడంతో మరోమారు ఆ స్పెల్ గురించి డిస్కస్ చేస్తున్నారు.