iDreamPost
android-app
ios-app

World Cup: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌! సూర్యకుమార్‌ యాదవ్‌ షాకింగ్‌ పోస్ట్‌

World Cup: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌! సూర్యకుమార్‌ యాదవ్‌ షాకింగ్‌ పోస్ట్‌

వన్డే వరల్డ్ కప్ 2023లో రసవత్తర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రేపు అనగా అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం లక్షమందికిపైగానే హాజరవుతారని బీసీసీఐ అంచనా వేస్తోంది. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు టికెట్ లభించిన వారు సంబరపడి పోతుంటే టికెట్ దొరకని వారు ఉసూరుమంటున్నారు.

కొందరైతే ఏకంగా టీమిండియా క్రికెటర్లను టికెట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్, స్నేహితులు, సన్నిహితులను ఉద్దేశించి ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్, పాక్ మధ్య జరుగనున్న హోరాహోరి మ్యాచ్ చూడాలని ప్రతిఒక్కరు కోరుకుంటుంటారు. కానీ టికెట్లు దొరకని వారు టీవీల్లోనే, ఫోన్లల్లో మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఇలా టికెట్లు దొరకని కొందరు టీమిండియా క్రికెటర్లను అభ్యర్థిస్తున్నారు.

ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కు ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నుంచి విపరీతమైన అభ్యర్థనలు రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సూర్య తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా వ్రాసుకొచ్చాడు.. “సోదరులారా, ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి మంచి టీవీలు ఉన్నాయి, ఏసీలో కూర్చుని మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తూ చూడండి. దయచేసి ఇకపై టిక్కెట్లు అడగవద్దు. అంటూ పెట్టిన స్టోరి నెట్టింటా వైరల్ గా మారింది. కాగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ ఎంపిక చేయడంతో సూర్యకుమార్ యాదవ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş