iDreamPost
android-app
ios-app

బాలీవుడ్‌ హీరోయిన్‌తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌

  • Published Jul 09, 2024 | 1:23 PM Updated Updated Jul 09, 2024 | 1:23 PM

Kuldeep Yadav, Bollywood: దేశానికి రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించడంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్‌ యాదవ్‌.. ఇప్పుడు తన పెళ్లి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Kuldeep Yadav, Bollywood: దేశానికి రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించడంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్‌ యాదవ్‌.. ఇప్పుడు తన పెళ్లి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jul 09, 2024 | 1:23 PMUpdated Jul 09, 2024 | 1:23 PM
బాలీవుడ్‌ హీరోయిన్‌తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన సంతోషంలో ఉన్నాడు. ఆ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి మూడు మ్యాచ్‌లు ఆడకపోయినా.. సూపర్‌ 8 నుంచి టీమిండియాలో కీ ప్లేయర్‌గా మారిపోయి.. 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి.. భారత జట్టు వరల్డ్‌ కప్‌ గెలవడంలో కీ రోల్‌ ప్లే చేశాడు. తన స్పిన్‌ మాయాజాలంతో టీమ్‌కు ఎంతో ఉపయోగపడ్డాడు. తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కుల్దీప్‌ యాదవ్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు.

తన లైఫ్‌లో నెక్ట్స్‌ స్టెప్‌ అయిన పెళ్లి గురించి స్పందిస్తూ.. తన గురించి వస్తున్న కొన్ని రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. కుల్దీప్‌ యాదవ్‌ త్వరలోనే ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గుసగుసలు వినిపించాయి. క్రికెటర్లు, హీరోయిన్లు ఈ కాంబినేషన్‌ ఎప్పటి నుంచో నడుస్తున్నదే. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్‌ హీరోయిన్లను, నటీమణులను పెళ్లి చేసుకున్నారు. విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, యుజ్వేంద్ర చాహల్‌, జహీర్‌ ఖాన్‌ వీరంతా బాలీవుడ్‌ యాక్టర్స్‌లను వివాహమాడారు.

అయితే.. కుల్దీప్‌ యాదవ్‌ సైతం బాలీవుడ్‌ నటిని పెళ్లి చేసుకోబోతున్నాడని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ.. మీరు త్వరలోనే ఒక గుడ్‌ న్యూస్‌ అయితే కచ్చితంగా వింటారు. కానీ, పెళ్లి కూతుర బాలీవుడ్‌ నటి అయితే కాదు. నన్ను, నా కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయిని తన భాగస్వామిగా ఎంచుకుంటాను అని కుల్దీప్‌ స్పష్టం చేశాడు. కాగా, కుల్దీప్‌ యాదవ్‌ ఏ హీరోయిన్‌తో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నాడు, ఏ బాలీవుడ్‌ నటితోనైనా డేటింగ్‌లో ఉన్నాడా? మరి ఈ రూమర్స్‌ ఎందుకు పుట్టాయి అనే విషయాలపై ఎలాంటి సమాచారం లేదు. మరి కుల్దీప్‌ పెళ్లిపై మాత్రం త్వరలోనే గుడ్‌న్యూస్‌ వస్తుందని స్పష్టమైంది. మరి తన పెళ్లి విషయంలో కుల్దీప్ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetslotime girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom