iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: శ్రీలంకపై సిరీస్‌ విజయం.. కోహ్లీ, రోహిత్‌ను టార్గెట్‌ చేస్తూ సూర్య కామెంట్స్‌?

  • Published Jul 31, 2024 | 12:48 PM Updated Updated Jul 31, 2024 | 12:48 PM

శ్రీలంకపై సిరీస్ విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సూర్య కామెంట్స్ ఇండైరెక్ట్ గా కోహ్లీ, రోహిత్ శర్మలను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని కొందరు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

శ్రీలంకపై సిరీస్ విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సూర్య కామెంట్స్ ఇండైరెక్ట్ గా కోహ్లీ, రోహిత్ శర్మలను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని కొందరు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

Suryakumar Yadav: శ్రీలంకపై సిరీస్‌ విజయం.. కోహ్లీ, రోహిత్‌ను టార్గెట్‌ చేస్తూ సూర్య కామెంట్స్‌?

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టోర్నీ ఆసాంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు లంకను మూడు మ్యాచ్ లోనూ చిత్తు చేసింది. చివరి మ్యాచ్ లో ఓడిపోతుందనుకున్న క్రమంలో స్టార్ బ్యాటర్లు బౌలర్లుగా మారి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక లంకపై సిరీస్ విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సూర్య కామెంట్స్ ఇండైరెక్ట్ గా కోహ్లీ, రోహిత్ శర్మలను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని కొందరు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇంతకీ సూర్య ఏమన్నాడంటే?

సూర్యకుమార్ యాదవ్.. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించిన ఈ స్టార్ బ్యాటర్, సారథిగా తన సత్తా ఏంటో చాటాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. 3-0తో సిరీస్ ను కైవసం చేసుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా టీమ్ ను ముందుండి నడిపించాడు. దాంతో నాయకుడిగా తొలి సిరీస్ లోనే సత్తాచాటాడు. ఇక శ్రీలంకపై సిరీస్ విజయం తర్వాత సూర్యకుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోహ్లీ, రోహిత్ లకు కౌంటర్ ఇచ్చాడా? అంటూ కొందరు క్రీడాభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Surya Counter on Rohith and kohli

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ..”టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియాలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. గతంలో లాగా  మేము ఇద్దరు లేదా ముగ్గురు ప్లేయర్లు కలిసి కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. మేము అందరం కలిసే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాము. అది కష్టమో.. నష్టమో. ఇలా అందరం కలిసి కూర్చోవడం వల్ల మాలో బాండింగ్ పెరుగుతుంది. అది టీమ్ విజయాలకు దోహదపడుతుంది” అంటూ స్కై చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

కోహ్లీ, రోహిత్ ను టార్గెట్ చేసుకునే సూర్య ఈ కామెంట్స్ చేశాడని కొందరు చెప్పుకొస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. గతంలో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు టీమ్ లో గ్రూప్ లు మెయింటెన్ చేశారన్న అపవాదులు ఎదుర్కొన్నారు. ఆ టైమ్ లో కొందరు ప్లేయర్లు మాత్రమే కలిసి కూర్చునే వారని సూర్య గుర్తు చేస్తూ.. ఈ కామెంట్స్ చేశాడని చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు అలా గ్రూప్స్, గ్యాంగ్స్ టీమ్ లో లేవన్న ఉద్దేశంలో స్కై వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి నిజంగానే కోహ్లీ, రోహిత్ లను టార్గెట్  చేస్తూ.. ఈ కామెంట్స్ చేశాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.