iDreamPost
android-app
ios-app

వీడియో: అసలు నవ్వే అలవాటు లేని గంభీర్.. ఈ మధ్య ఎందుకు నవ్వుతున్నాడు!

  • Published Jul 31, 2024 | 12:21 PM Updated Updated Jul 31, 2024 | 12:21 PM

Gautam Gambhir, Rinku Singh, Riyan Parag, Suryakumar Yadav: టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌.. ఈ మధ్య బాగా నవ్వుతున్నాడు. గతంలో ఎప్పుడూ గంభీర్‌ ఇలా లేడు. మరి ఇప్పుడే ఎందుకు నవ్వుతున్నాడు. దాని వెనుకు ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, Rinku Singh, Riyan Parag, Suryakumar Yadav: టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌.. ఈ మధ్య బాగా నవ్వుతున్నాడు. గతంలో ఎప్పుడూ గంభీర్‌ ఇలా లేడు. మరి ఇప్పుడే ఎందుకు నవ్వుతున్నాడు. దాని వెనుకు ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 31, 2024 | 12:21 PMUpdated Jul 31, 2024 | 12:21 PM
వీడియో: అసలు నవ్వే అలవాటు లేని గంభీర్.. ఈ మధ్య ఎందుకు నవ్వుతున్నాడు!

శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు అలాగే హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌కు ఇది అద్భుతమైన స్టార్‌ అని చెప్పాలి. గతంలో సూర్య కెప్టెన్‌గా వ్యవహరించినా.. అప్పుడు అతను తాతాల్కిక కెప్టెన్‌ మాత్రమే, ఇప్పుడు అతను టీ20 జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ అనే విషయం తెలిసిందే. అలాగే రాహుల్‌ ద్రవిడ్‌ వారసుడిగా భారత జట్టు హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సిరీస్‌ కావడంతో అతనికి కూడా అది మంచి ఆరంభం. అయితే.. గతంలో గంభీర్‌ను ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. గంభీర్‌ అంటే ఎప్పుడూ గంభీరంగా ఉండే వ్యక్తి. కానీ, టీమిండియాకు హెడ్‌ కోచ్‌ అయిన తర్వాత నుంచి ఎక్కువగా నవ్వుతున్నాడు. మరి ఆ నవ్వు వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గౌతమ్‌ గంభీర్‌.. టీమిండియా తరఫున చాలా మ్యాచ్‌లు ఆడాడు. కొంతకాలం వైస్‌ కెప్టెన్‌గా, కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్స్‌ సభ్యుడిగా ఉన్నాడు. అలాగే ఆ రెండు మెగా ఈవెంట్స్‌ ఫైనల్స్‌లో అతనే టాప్‌ స్కోరర్‌. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి.. పాలిటిక్స్‌లోకి వెళ్లిన గంభీర్‌ ఎంపీగా కూడా పనిచేశాడు. 2022 నుంచి 2024 వరకు ఐపీఎల్‌లో మెంటర్‌గా పని చేశాడు. రెండేళ్లు లక్నోకు, ఈ ఏడాది కేకేఆర్‌ మెంటర్‌గా వ్యవహరించాడు. ఇన్ని రోల్స్‌ మారినా గంభీర్‌ మాత్రం మారలేదు. ఎప్పుడూ సీరియస్‌గా ఉంటాడు. మ్యాచ్‌ గెలిచినా, ఓడినా.. గంభీర్‌ ముఖంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ, టీమిండియా హెడ్‌ కోచ్‌ అయిన తర్వాత ఈ మధ్య నవ్వుతున్నాడు.

Smiling gambhir

ఈ నెల 27న శ్రీలంకతో పల్లెకలె వేదికగా జరిగిన తొలి టీ20లో యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా బౌలింగ్‌ వేసి.. 1.2 ఓవర్లలో కేవలం 5 రన్స్‌ ఇచ్చి ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. పరాగ్‌ వికెట్లు తీస్తుంటే గంభీర్‌ నవ్వుకున్నాడు. అలాగే మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ తొలిసారి బౌలింగ్‌ చేస్తూ రెండేసి వికెట్లు పడగొట్టాడు. అప్పుడు కూడా గంభీర్‌ నవ్వులు చిందించాడు. డగౌట్‌లో గంభీర్‌ను ఇలా గతంలో ఎప్పుడు చూడలేదు. అయితే.. టీమిండియాలో మిస్‌ అవుతున్న పార్ట్‌టైమ్‌ బౌలర్ల సంప్రదాయాన్ని గంభీర్‌ తిరిగి ప్రవేశపెట్టాడు. స్టార్‌ బ్యాటర్లను అవసరమైన సమయంలో బౌలింగ్‌లో కూడా ఉపయోగించుకుని.. వారిని మంచి ఆల్‌రౌండర్లుగా మార్చాలనే తన ఆలోచన.. సూపర్‌గా సక్సెస్‌ అవుతున్న సమయంలో గంభీర్‌ సంతోషంగా స్వచ్ఛమైన నవ్వులు చిందిస్తున్నాడు. ఆ నవ్వు వెనుక ఈ బ్యాటర్లు బౌలింగ్‌ వేసేందుకు వారిని ఒప్పించడానికి పడిన కష్టం, వారితో ప్రాక్టీస్‌ చేయించిన శ్రమను మర్చిపోతూ.. గంభీర్‌ ముఖంపై నవ్వులు పూయించాడు. సక్సెస్‌ తెచ్చిన నవ్వుతో గంభీర్‌ ముఖం థౌజండ్‌ వాట్స్‌ లైట్‌లా వెలిగిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.