SNP
Suryakumar Yadav, Shubman Gill, IND vs SL: టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రెండో టీ20లో ఎందుకు పక్కనపెట్టాల్సి వచ్చిందో కెప్టెన్ సూర్య వెల్లడించాడు. మరి అతను చెప్పిన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Suryakumar Yadav, Shubman Gill, IND vs SL: టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రెండో టీ20లో ఎందుకు పక్కనపెట్టాల్సి వచ్చిందో కెప్టెన్ సూర్య వెల్లడించాడు. మరి అతను చెప్పిన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో టీ20కి వర్షం అంతరాయం కలిగించినా.. టీమిండియా విజయాన్ని ఆపలేకపోయింది. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోండి సూర్య సేన. ఆదివారం పల్లెకలె వేదికగా జరిగిన మ్యాచ్.. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. వర్షం కారణంగా పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఛేజింగ్ ఎంచుకున్నాడు. సూర్య నిర్ణయం కరెక్ట్ అని భారత కుర్రోళ్లు నిరూపించారు. అయితే.. తొలి టీ20లో కేవలం 16 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడని స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఈ మ్యాచ్‌లో టీమిండియా పక్కనపెట్టింది.
గిల్ లేకుండానే రెండో టీ20లో భారత జట్టు బరిలోకి దిగింది. గిల్ స్థానంలో సంజు శాంసన్‌ను ఆడించింది భారత్. ఎప్పటి నుంచో టీమిండియాలో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్‌కు ఎట్టకేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కినందుకు క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేసినా.. మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌ను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. అయితే.. గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే అతనికి రెస్ట్ ఇచ్చిన సంజు శాంసన్‌ను తీసుకున్నాం అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ తర్వాత వెల్లడించాడు. అయితే.. గిల్ స్థానంలో ఆడిన సంజు శాంసన్ గోల్డెన్ డక్‌గా నిరాశపర్చాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుసల్ పెరీరా 34 బంతుల్లో 53, పథుమ్ నిస్సంకా 32, కమిందు మెండిస్ 26 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అర్షదీప్, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇక ఛేజింగ్‌కు దిగిన టీమిండియాకు వర్షం అంతరాయం కలిగించింది. ఇన్నింగ్స్ ఆరంభించి.. జైస్వాల్ మూడు బంతులు ఎదుర్కొన్న తర్వాత భారీ వర్షం రావడంతో మ్యాచ్ చాలా సేపు నిలిచిపోయింది. దీంతో.. అంపైర్లు టార్గెట్‌ను 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్‌ను టీమిండియా 6.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జైస్వాల్ 30, సూర్యకుమార్ యాదవ్ 26, హార్ధిక్ పాండ్యా 22 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో గిల్ స్థానంలో సంజును ఆడించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shubman Gill Out
Sanju Samson Inn #INDvsSL pic.twitter.com/rJUcpcw28g— Richard Kettleborough (@RichKettle07) July 28, 2024