iDreamPost
android-app
ios-app

Musheer Khan: సెంచరీ హీరో ముషీర్​పై సూర్యకుమార్ ప్రశంసలు.. అది మర్చిపోవద్దంటూ..!

  • Published Sep 05, 2024 | 8:34 PM Updated Updated Sep 05, 2024 | 8:34 PM

Suryakumar Yadav Praises Musheer Khan: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. టోర్నమెంట్ తొలి రోజు అతడి ఆటే హైలైట్​గా నిలిచింది. సెంచరీతో వీరవిహారం చేశాడీ యంగ్ గన్.

Suryakumar Yadav Praises Musheer Khan: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. టోర్నమెంట్ తొలి రోజు అతడి ఆటే హైలైట్​గా నిలిచింది. సెంచరీతో వీరవిహారం చేశాడీ యంగ్ గన్.

  • Published Sep 05, 2024 | 8:34 PMUpdated Sep 05, 2024 | 8:34 PM
Musheer Khan: సెంచరీ హీరో ముషీర్​పై సూర్యకుమార్ ప్రశంసలు.. అది మర్చిపోవద్దంటూ..!

దులీప్ ట్రోఫీ-2024 తొలి రోజే సంచలనాలు నమోదయ్యాయి. భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు కీలకంగా మారిన ఈ టోర్నమెంట్​లో అదరగొట్టాలని డిసైడ్ అయిన స్టార్లు.. ఫస్ట్ డే అట్టర్ ఫ్లాప్ అయ్యారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి టీమిండియా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే అనూహ్యంగా ఓ యువ కెరటం దూసుకొచ్చాడు. సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. అందరూ తన గురించే డిస్కస్ చేసేలా చేశాడు. అతడే సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్. దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్​లోనే సెంచరీ (227 బంతుల్లో 105 నాటౌట్)తో వీరవిహారం చేశాడతను. ఇండియా ఏతో జరిగిన మ్యాచ్​లో క్లాసికల్ ఇన్నింగ్స్​తో అలరించాడు. దీంతో అందరూ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అతడి బ్యాటింగ్​కు ఫిదా అయిపోయాడు.

ముషీర్ ఇన్నింగ్స్​ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు సూర్యకుమార్. అద్భుతమైన నాక్ ఆడావ్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. రోజూ ప్రాక్టీస్ చేస్తూ ఉండు.. అది మాత్రం మర్చిపోకని అన్నాడు. అన్నయ్యగా సర్ఫరాజ్​కు ఇవి సంతోషకరమైన క్షణాలని తెలిపాడు సూర్య. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అవుతావంటూ ముషీర్​కు సూచించాడు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ముషీర్ ఇన్నింగ్స్ అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. అంత ఒత్తిడిలోనూ, టాప్ బౌలర్లను ఫేస్ చేస్తూ కూడా కూల్​గా అతడు బ్యాటింగ్ చేసిన తీరు అదిరిపోయిందని అంటున్నారు. ఇలాంటి బ్యాటర్ల అవసరం టెస్టుల్లో ఎంతగానో ఉందని, ముషీర్​ను టీమిండియాలోకి తీసుకోవాలని సజెషన్ ఇస్తున్నారు. అన్నతో పాటు తమ్ముడు కూడా టీమ్​లో ఉంటే మనకు ఎదురుండదని చెబుతున్నారు.

ఇక, దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ డే ముషీర్ బ్యాటింగ్ స్పెషల్ హైలైట్​గా నిలవడానికి మరో కారణం అతడు ఎదుర్కొన్న బౌలర్లు. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్​దీప్ లాంటి టీమిండియా స్టార్లను అతడు ఫేస్ చేశాడు. వారికి వికెట్ ఇవ్వకపోగా.. అందర్నీ దంచికొట్టాడు. సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడాడు. నవ్​దీప్ సైనీ (74 బంతుల్లో 29) సపోర్ట్​తో ముషీర్ రెచ్చిపోయాడు. ఓవరాల్​గా 10 బౌండరీలు, 2 సిక్సులు కొట్టిన ఈ యంగ్ సెన్సేషన్.. ఎక్కువగా స్ట్రైక్ రొటేషన్​కే ప్రాధాన్యత ఇచ్చాడు. వికెట్లు పడుతుండటంతో అడ్డగోలు షాట్స్ ఆడకుండా కూల్​గా బ్యాటింగ్ చేశాడు. సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్​తో ఆకట్టుకున్నాడు. అదే టైమ్​లో క్లాసికల్ షాట్స్ ఆడుతూ అలరించాడు. మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడిన ఈ యంగ్ బ్యాటర్ ఇంకా నాటౌట్​గా ఉన్నాడు. రెండో రోజు అతడు ఎంతసేపు క్రీజులో ఉంటే ఇండియా బీకి అంత మంచిది. మరి.. ముషీర్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.