iDreamPost
android-app
ios-app

వీడియో: రుతురాజ్​ను గెలికిన హర్షిత్ రానా.. ఫ్లయింగ్ కిస్ రిపీట్! BCCI ఏం చేస్తుందో?

  • Published Sep 05, 2024 | 7:23 PM Updated Updated Sep 05, 2024 | 7:23 PM

Harshit Rana, Ruturaj Gaikwad, Duleep Trophy 2024: యంగ్ పేసర్ హర్షిత్ రానా తన బౌలింగ్ కంటే సెలబ్రేషన్స్​తోనే ఎక్కువగా వైరల్ అవుతుంటాడు. తాజాగా అతడు మరోమారు తన ఫేవరెట్ సెలబ్రేషన్స్​తో చర్చనీయాంశంగా మారాడు.

Harshit Rana, Ruturaj Gaikwad, Duleep Trophy 2024: యంగ్ పేసర్ హర్షిత్ రానా తన బౌలింగ్ కంటే సెలబ్రేషన్స్​తోనే ఎక్కువగా వైరల్ అవుతుంటాడు. తాజాగా అతడు మరోమారు తన ఫేవరెట్ సెలబ్రేషన్స్​తో చర్చనీయాంశంగా మారాడు.

  • Published Sep 05, 2024 | 7:23 PMUpdated Sep 05, 2024 | 7:23 PM
వీడియో: రుతురాజ్​ను గెలికిన హర్షిత్ రానా.. ఫ్లయింగ్ కిస్ రిపీట్! BCCI ఏం చేస్తుందో?

ఐపీఎల్-2024లో ఓ సెలబ్రేషన్ బాగా వివాదాస్పదంగా మారడం గుర్తుండే ఉంటుంది. సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో మయాంక్ అగర్వాల్​ను ఔట్ చేశాక కోల్​కతా నైట్ రైడర్స్ యంగ్ పేసర్ హర్షిత్ రానా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. క్రీజు విడిచి వెళ్లిపోతున్న మయాంక్​ను ఫ్లయింగ్ కిస్ ఇస్తూ రెచ్చగొట్టాడు హర్షిత్ రానా. ఆ తర్వాత మరో మ్యాచ్​లోనూ అపోజిషన్ టీమ్ డగౌట్ వైపు చూస్తూ ఇదే తరహాలో సెలబ్రేట్ చేసుకోవడంతో అతడిపై బ్యాన్ కూడా విధించారు. దీంతో ఆ టోర్నీ మటుకు సెలబ్రేషన్స్​ను ఆపేసిన హర్షిత్.. తాజాగా దులీప్ ట్రోఫీలో దాన్ని రిపీట్ చేశాడు. ఇండియా సీ తరఫున బౌలింగ్​కు దిగిన ఈ యువ స్పీడ్​స్టర్.. ఇండియా డీ కెప్టెన్ రుతురాజ్​ గైక్వాడ్​ను ఔట్ చేసి సిగ్నేచర్ స్టైల్​లో సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇండియా సీతో మ్యాచ్​లో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అద్భుతమైన బౌలింగ్​తో అదరగొట్టాడు హర్షిత్ రానా. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. షాట్లు కొట్టాలంటే బ్యాటర్లు భయపడేలా ఫుల్ కంట్రోల్​తో బౌలింగ్ చేశాడు. స్వింగ్​కు పిచ్ నుంచి లభిస్తున్న మద్దతును ఉపయోగించుకొని బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఐదో ఓవర్​లో సాయి సుదర్శన్​ను వెనక్కి పంపించిన హర్షిత్.. ఏడో ఓవర్​లో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పని పట్టాడు. అతడు వేసిన చక్కటి ఇన్​స్వింగర్​ను డిఫెండ్ చేయడంలో ఫెయిలైన గైక్వాడ్​ సెకండ్ స్లిప్​కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఔట్ అయి వెళ్లిపోతున్న అతడ్ని హర్షిత్ గెలికాడు. ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయినా అతడు మాత్రం సైలెంట్​గా పెవిలియన్ దిశగా సాగాడు.

ఐపీఎల్​లో ఫ్లయింగ్ కిస్​తో సెలబ్రేట్ చేసుకున్నందుకు హర్షిత్ మీద బ్యాన్ విధించారు. ఇప్పుడు దాన్ని దులీప్ ట్రోఫీలోనూ రిపీట్ చేశాడు. దీంతో అతడి విషయంలో భారత క్రికెట్ బోర్డు ఏం చేస్తుందోననేది ఆసక్తికరంగా మారింది. అతడిపై చర్యలు తీసుకుంటుందా? లేదా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా? అనేది చూడాలి. సెలబ్రేషన్స్ పరంగా ఓవరాక్షన్ చేసిన హర్షిత్.. బౌలింగ్​లో మాత్రం దుమ్మురేపాడు. రెండు ఓవర్లలో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేశాడు. దీంతో అతడ్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బౌలర్లు టీమిండియాలోకి రావాలని, అతడిలో మంచి టాలెంట్ ఉందని అంటున్నారు. అయితే డిసిప్లిన్ చాలా ముఖ్యమని.. ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడం లాంటివి మానుకోవాలని సూచిస్తున్నారు.

బౌలింగ్​పై ఫోకస్ చేయాలని.. ఇతర విషయాలను తగ్గించుకుంటే హర్షిత్ రానా కెరీర్​కే మంచిదని సజెషన్ ఇస్తున్నారు నెటిజన్స్. మంచి ఫ్యూచర్ ఉందని, ఇలాంటి పనులతో బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకోవద్దని చెబుతున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో ఇండియా డీ ఫస్ట్ ఇన్నింగ్స్​లో 164 రన్స్​కు కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇండియా సీ తొలి రోజు ఆట ముగిసేసరికి 91/4తో ఉంది. మరి.. హర్షిత్ రానా సెలబ్రేషన్స్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.