Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ భయంతో గ్రౌండ్లో నుంచి పారిపోయారు. అసలు వాళ్లు దేనికి భయపడ్డారు? ఎందుకు పరుగులు తీశారో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ భయంతో గ్రౌండ్లో నుంచి పారిపోయారు. అసలు వాళ్లు దేనికి భయపడ్డారు? ఎందుకు పరుగులు తీశారో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఆటల్లో జరిగే కొన్ని ఘటనలు నవ్విస్తే.. మరికొన్ని బాధపడతాయి. క్రికెట్లోనూ ఎన్నో ఫన్నీ ఇన్సిండెంట్స్ జరిగాయి. అదే టైమ్‌లో ఇదేంట్రా బాబు అనుకునే ఆశ్చర్యకరమైన ఉదంతాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటివి సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతుంటాయి. టీమిండియా స్టార్ బ్యాటర్స్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌కు సంబంధించిన ఓ వీడియో ఈ కోవలోకే వస్తుంది. ఒక గ్రౌండ్లో నుంచి సూర్య, అయ్యర్ భయంతో పరుగులు తీస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఎందుకు వీళ్లిద్దరూ ఇలా పరుగులు తీయాల్సి వచ్చింది? సూర్య-అయ్యర్‌కు ఏమైంది? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు టీమిండియా అభిమానులు. అయితే గాభరా పడాల్సిన అవసరం లేదు. వాళ్లకేమీ కాలేదు.
చాన్నాళ్ల కింద సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఒక లోకల్ టోర్నమెంట్లో కలసి ఆడారు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న బీపీసీఎల్ జట్టు ఆ సమయంలో ఛేజింగ్ చేస్తోంది. క్రీజులో అయ్యర్ (17 బంతుల్లో 34 పరుగులు), సూర్య (20 బంతుల్లో 41 పరుగులు) ఉన్నారు. అప్పటికి బీపీసీఎల్ టీమ్ 16.3 ఓవరల్లో 3 వికెట్లకు 180 పరుగులతో ఉంది. విజయానికి చేరువలో ఉన్న టీమ్‌ను సూర్యకుమార్ యాదవ్ బౌండరీ కొట్టి గెలిపించాడు. అంతే ఒక్కసారిగా గ్రౌండ్ బయట ఉన్న అభిమానులు అంతా పిచ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేసిన అయ్యర్, సూర్య దగ్గరకు వచ్చారు. అయితే వందలాది మంది ఒకేసారి తమ వైపు దూసుకొని రావడంతో భయపడ్డ సూర్య-అయ్యర్లు డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు తీశారు.
శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్లో నుంచి భయంతో పరుగులు తీస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ ఎప్పుడో జరిగింది. పాత వీడియోనే అయినా సోషల్ మీడియాను మాత్రం షేక్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పాత రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు. 80, 90వ దశకంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో మ్యాచ్‌లు ముగిశాక అభిమానులు ఇలాగే గ్రౌండ్లలోకి వచ్చేవారని అంటున్నారు. ఇక, సౌతాఫ్రికా టూర్లో గాయపడిన సూర్యకుమార్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. జర్మనీలోని సర్జరీ చేయించుకున్న స్కై.. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫొటోను కొన్ని రోజుల కింద పంచుకున్నాడు. తాను కోలుకుంటున్నానని.. తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఇక, శ్రేయస్ అయ్యార్ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతున్నాడు. తొలి టెస్టులో అతడు బరిలోకి దిగడం ఖాయం. మరి.. సూర్య-అయ్యర్ల రన్నింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shreyas Iyer: Bhag SURYA bhag! pic.twitter.com/W16ltTwp6r
— Sameer Allana (@HitmanCricket) January 23, 2024