Nidhan
Team India: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం రెడీ అవుతున్న ఈ వరల్డ్ కప్ హీరో.. తన సత్తా ఏంటో మరోమారు అందరికీ చూపించాలని అనుకుంటున్నాడు.
Team India: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం రెడీ అవుతున్న ఈ వరల్డ్ కప్ హీరో.. తన సత్తా ఏంటో మరోమారు అందరికీ చూపించాలని అనుకుంటున్నాడు.
Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం రెడీ అవుతున్న ఈ వరల్డ్ కప్ హీరో.. తన సత్తా ఏంటో మరోమారు అందరికీ చూపించాలని అనుకుంటున్నాడు. ఫిట్నెస్ ఇష్యూస్ సాకుగా చూపి అతడ్ని కెప్టెన్సీకి ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. గాయం నంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌లోనూ రెస్ట్ లేకుండా ఆడాడు పాండ్యా. ఇరు టోర్నీల్లోనూ బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేశాడు. మెగాటోర్నీలో ఆల్‌రౌండర్ స్థానానికి న్యాయం చేస్తూ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. అయినా అతడ్ని కాదని.. మరో సీనియర్ సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.
హార్దిక్‌ను కెప్టెన్సీకి దూరంగా ఉంచిన బోర్డు.. వన్డే టీమ్‌కు కూడా ఎంపిక చేయకపోవడం గమనార్హం. దులీప్ ట్రోఫీలో ఆడి ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటేనే వన్డేలకు సెలెక్ట్ చేస్తామని తెలిపింది. దీంతో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చుతున్నాడీ వరల్డ్ కప్ హీరో. అన్నింటికీ తన పెర్ఫార్మెన్స్తోనే సమాధానం చెప్పాలని అనుకుంటున్నాడు. ఇక మీదట టీమ్‌లో అతడి రోల్ ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో హార్దిక్ గురించి కొత్త కెప్టెన్ సూర్యకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాండ్యా తమకు ఎంతో కీలకమైన ఆటగాడని అన్నాడు. జట్టుకు అతడి సేవలు ఎంతో ముఖ్యమని చెప్పాడు.
‘మా జట్టులో హార్దిక్ పాండ్యా ఎంతో విలువైన ఆటగాడు. టీమ్‌కు అతడి అవసరం ఉంది. గతంలో టీమ్‌కు ఎలాంటి సేవలు అందించాడో ఇప్పుడు కూడా అదే పని చేయాలి. అతడి రోల్లో ఎలాంటి మార్పు లేదు. ఆల్‌రౌండర్‌గా అతడి నుంచి మంచి ప్రదర్శనను ఊహిస్తున్నాం’ అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ టైమ్‌లో మాజీ సారథి రోహిత్ శర్మ సహా సూర్యకుమార్, బుమ్రాను కూడా హార్దిక్ లెక్క చేయలేదని వార్తలు వచ్చాయి. టీమ్‌లో తాను చెప్పిందే నడవాలనేలా పాండ్యా పొగరుగా బిహేవ్ చేశాడని కామెంట్స్ వినిపించాయి. ఇదే టైమ్‌లో భారత కెప్టెన్సీ విషయంలోనూ హార్దిక్‌తో పోటీ నెలకొనడంతో అతడి విషయంలో సూర్య ఎలా వ్యవహరిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కానీ మిస్టర్ 360 మాత్రం అవేవీ మనసులో ఉంచుకోకుండా పాండ్యా తమకు ముఖ్యమని చెప్పడంతో అంతా కూల్ అయ్యారు. మరి.. సూర్య-హార్దిక్ జోడీ టీ20ల్లో రోకో జోడీలా భారత్‌ను విజయాల బాట పట్టిస్తారని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Suryakumar Yadav said “Hardik Pandya is a very important player for us, his role will be the same”. [RevSportz] pic.twitter.com/gRxRCYiQrR
— Johns. (@CricCrazyJohns) July 26, 2024