iDreamPost
android-app
ios-app

వీడియో: టీమిండియా గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఎవరో చెప్పిన బుమ్రా! ధోని, కోహ్లీ, రోహిత్‌ కాదు..

  • Published Jul 26, 2024 | 3:31 PM Updated Updated Jul 26, 2024 | 3:31 PM

Jasprit Bumrah, Team India: టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. భారత క్రికెట్‌ చరిత్రలో గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఎవరో చెప్పేశాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Jasprit Bumrah, Team India: టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. భారత క్రికెట్‌ చరిత్రలో గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఎవరో చెప్పేశాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jul 26, 2024 | 3:31 PMUpdated Jul 26, 2024 | 3:31 PM
వీడియో: టీమిండియా గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఎవరో చెప్పిన బుమ్రా! ధోని, కోహ్లీ, రోహిత్‌ కాదు..

టీమిండియాలో గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఎవరు? అనే ప్రశ్నకు స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఊహించిన ఆన్సర్‌ ఇచ్చాడు. ఇటీవలె ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అద్భుతమైన ప్రదర్శనతో బుమ్రా టీమిండియాకు కప్పు అందించాడు. ఆ మెగా టోర్నీ తర్వాత.. ప్రస్తుతం రెస్ట్‌ మూడ్‌లో ఉన్న బుమ్రా, ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇప్పటి వరకు టీమిండియాకు కెప్టెన్సీ చేసిన వారిలో గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఎవరనే విషయంపై స్పందిస్తూ.. తానే గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ అంటూ సమాధానం ఇచ్చాడు.

భారత జట్టుకు ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు కెప్టెన్లుగా చేశారని, తాను కూడా గొప్ప కెప్టెన్ల అండర్‌లో ఆడాడని, కానీ, టీమిండియా గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఎవరంటే మాత్రం నేను నా పేరు చెప్పుకుంటానంటూ ఊహించని సమాధానంతో షాకిచ్చాడు బుమ్రా. నేను కెప్టెన్సీ చేసింది తక్కువ మ్యాచ్‌లే అయినా.. నాకు నేను గ్రేట్‌ కెప్టెన్‌గా అనిపిస్తానంటూ పేర్కొన్నాడు బుమ్రా. అతని కెప్టెన్సీలో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒక టెస్టు, రెండు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.

అయితే.. బుమ్రా దిగ్గజ మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఆడాడు. కానీ, ఇండియన్‌ గ్రేటెస్ట్‌ కెప్టెన్‌ ఎవరంటే మాత్రం వాళ్లలో ఏ ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. వాళ్లు ముగ్గురు కాకుండా తన పేరు చెప్పుకున్నాడు. అయితే.. ధోని, కోహ్లీ, రోహిత్‌ పేర్లలో ఏ ఒక్కరి పేరు చెప్పినా.. మిగతా వాళ్లు బాధపడతారనో లేక, వారి అభిమానుల నుంచి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురి అవుతాననో బుమ్రా ఎవరి పేరు చెప్పకుండా సేఫ్‌సైడ్‌గా తన పేరు చెప్పుకున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.