SNP
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆట గురించి చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటుంది. కానీ, సురేష్ రికార్డులు మాత్రం పెద్దగా ఎవరికీ తెలియవు. అయితే.. రైనా తన రికార్డుల కంటే.. టీమ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక నిస్వార్థ క్రికెటర్. అతని గురించి పూర్తి స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆట గురించి చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటుంది. కానీ, సురేష్ రికార్డులు మాత్రం పెద్దగా ఎవరికీ తెలియవు. అయితే.. రైనా తన రికార్డుల కంటే.. టీమ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక నిస్వార్థ క్రికెటర్. అతని గురించి పూర్తి స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఒక ఆటగాడి గొప్పతనం గురించి చెప్పాలంటే.. అతను చేసిన పరుగులో, వికెట్లో కొలమానంగా చెప్తారు. క్రికెట్‌లో గొప్ప గొప్ప ఆటగాళ్లుగా కీర్తించడబడాలంటే.. టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది వికెట్లు అవసరం. కానీ, అవి సాధించాలంటే గేమ్ టైమ్ దొరకాలి. ఇప్పటి వరకు మనకు తెలిసిన గ్రేట్ క్రికెటర్లుకు అలాంటి గేమ్ టైమ్ పుష్కలంగా లభించింది. టీమ్‌లోకి వచ్చి.. మంచి పొజిషన్‌లో బ్యాటింగ్, క్రీజ్‌లోకి వచ్చి కుదురుకోవడానికి కావాల్సినంత టైమ్.. ఇవన్నీ ఉంటే ఒక సాధారణ ఆటగాడు, మంచి ఆటగాడిగా, ఒక మంచి ప్లేయర్.. గ్రేట్ ప్లేయర్‌గా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. కానీ, ఇవన్నీ లేకుండానే ఒక క్రికెటర్.. లెజెండ్ అయ్యాడు. ఎంతో మంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్య క్రికెటర్ అయ్యాడు. ఇంకా మనం పైన చెప్పుకున్నవన్నీ దొరికి ఉంటే.. అతను లెజెండ్స్‌కే లెజెండ్ అయ్యేవాడు. అతనే సురేష్ రైనా.
చిరుత లాంటి వేగం..
బౌలర్లపై విరుచుకుపడే తెగువ..
దేశం కోసం మాత్రమే ఆడుతున్నా అనే గర్వం..
టీమ్ ఫస్ట్.. నేను లాస్ట్ అనే గొప్ప మససు.. ఇవన్నీ కలిసి క్రికెట్ ఆడితే అది సురేష్ రైనా.
ఏమాత్రం డిబెట్ అవసరం లేకుండా రైనా ఒక అద్భుతమైన ఆటగాడని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే.. రైనా టీమిండియా కోసం ఎంతో చేశాడు కానీ, తనకు తాను మాత్రం పెద్దగా ఏం చేసుకోలేదు. ప్రపంచ క్రికెట్‌ను శాసించే టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఆటగాడు రైనానే. అలాంటి చరిత్రలో నిలిచిపోయే రికార్డు ఉన్న ఆటగాడు తన అంతర్జాతీయ క్రికెట్‌లో చేసిన సెంచరీలు ఎన్నో తెలుసా? కేవలం 7. హేమాహేమీ ఆటగాళ్లకు సాధ్యంకానీ మూడు ఫార్మాట్ల సెంచరీ రికార్డును సాధించిన ఆటగాడు అన్ని ఫార్మాట్లలో కలిపి కేవలం 7 సెంచరీలు మాత్రమే చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? దానికి అనేక కారణాలున్నాయి.. దేశం కోసం ఆడుతున్నాను అనే రైనా నిస్వార్థం కూడా అందుకు ఒక కారణమే. అందుకే రైనా అంటే ప్రతి క్రికెట్ అభిమానికి ఎంతో అభిమానం.
ఇండియన్ క్రికెట్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో అతి చిన్న వయసులో వచ్చిన రెండో ఆటగాడు సురేష్ రైనా. 2005లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి.. దాదాపు 13 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. తన కెరీర్‌లో ఎక్కువ శాతం లోయర్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేశాడు. మొత్తం బ్యాటింగ్ లైనప్‌లో ఏ ప్లేస్‌లో అయినా సరే ఆడే సత్తా ఉన్నా.. టీమ్ అవసరాల కోసం చివర్లోనే బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అప్పటికే టీమ్‌లో పాతుకుపోయినా.. సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్, గంగూలీ, యువరాజ్ సింగ్ లాంటి వాళ్లతో పోటీ పడుతూ.. తనతో పాటు వచ్చిన ధోని, గంభీర్.. తర్వాత వచ్చిన కోహ్లీ, ధావన్, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లతో కూడా రైనా పోటీ పడ్డాడు. టాలెంట్‌లో కానీ, వేగంగా ఆడటంలో కానీ, వికెట్లు కాపాడటంలో కానీ, పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పడంలో కానీ.. వీరంద్దరికీ రైనా ఏ మాత్రం తీసిపోడు.
ఇన్‌ఫ్యాక్ట్.. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ లిస్ట్‌లో చాలా మంది కంటే కూడా రైనా టెక్నికల్‌గా ఎంతో మెరుగైన ఆటగాడు. పైగా ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొని ఆడగలడు, ఎంత వేగం కావాలంటే అంత వేగంగా పరుగులు చేయగలడు.. రైనా అగ్రెసివ్ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. ఐపీఎల్‌ను ఆరంభ సీజన్ నుంచి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ రైనా విధ్వంసం గురించి తెలుసు. అతను ఎదురుదాడి చేస్తే.. ఎంత పెద్ద టార్గెటైనా చిన్నదే. అలాంటి ఆటగాడు.. ఎందుకు ఎప్పుడూ బ్యాటింగ్ ఆర్డర్‌లో చివర్లోనే ఉండిపోయాడు. వన్ డౌన్, మిడిల్డార్‌లో ఆడే సత్తా మెండుగా ఉన్నా.. ఎందుకు ఎప్పుడూ కెప్టెన్‌పై ఒత్తిడి తెచ్చి ముందుగా బ్యాటింగ్‌కు రాలేదంటే.. అది రైనా గొప్పతనం. ఎప్పుడూ టీమ్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు.
రైనాలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. ఇండియా గెలిస్తే చాలు.. అందుకోసం తాను సెంచరీ చేశానా, పది పరుగులు చేశానా అనేది అనవసరం. పోనీ బ్యాటింగ్ రాలేదా.. పార్ట్‌టైమ్ బౌలర్‌గా, అద్భుతమైన ఫీల్డర్‌గా తన వందశాతం ఎఫర్ట్ ఇచ్చేవాడు. ఇప్పటి వరకు టీమిండియా చూసిన గొప్ప ఫీల్డర్లలో రైనా ఒకడు. అయితే.. రైనా ఎంత గొప్ప ప్లేయర్ అయినా.. తన సెంచరీలు ఎందుకంత తక్కువ ఉన్నాయంటే.. లోయర్ ఆర్డర్లో ఆడటమే కారణం. రైనా బ్యాటింగ్‌కు వచ్చే సరికి కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉంటాయి.. అది వన్డేల్లో అయినా సరే. అందుకే క్రీజ్‌లోకి రావడం రావడంతోనే బాదడమే రైనా పని. లేదా ఓవర్లు ఎక్కువ ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే.. అప్పటికే జట్టు బ్యాటింగ్ లైనప్ కోల్యాప్స్ అయి ఉంటుంది. తక్కువ పరుగులకు ఎక్కువ వికెట్లు పడిపోయి ఉండటంతో మిగిలిన టెయిలెండర్లతో ఇన్నింగ్స్‌ను నిర్మించాలి. ఇలా ఎప్పుడూ.. క్లిష్ట పరిస్థితుల్లోనే రైనా బ్యాటింగ్‌కి వచ్చేవాడు. కానీ, ఎంత కఠిన పరిస్థితులు ఉన్నా.. రైనా తన హండ్రెడ్ పర్సంట్ ఇచ్చేవాడు.
దేశం కోసం, జట్టు కోసం.. రైనా చేసిన త్యాగమే కాదు, అతను చూపించి తెగువ కూడా అద్భుతమే. రైనా కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. చేసిన పరుగులు తక్కువే కావచ్చు. కానీ, ఇంప్యాక్ట్ మాత్రం పెద్దది. రైనా ఇన్నింగ్స్‌లు ఎలా ఉంటాయంటే.. చావుబతుల్లో ఉన్న వ్యక్తికి నోటితో గాలి ఊది ప్రాణాలు నిలిపడం లాంటివి. గాలి ఊదడం చిన్న విషయమే.. తక్కువ పరుగుల్లా. కానీ, సరైన టైమ్‌కి స్పందించి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టడం మ్యాచ్ గెలిపించడం లాంటిది. అందుకు చక్కటి ఉదాహరణ.. 2011 వరల్డ్ కప్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ధోని కెప్టెన్సీలో టీమిండియా 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా గట్టెక్కి ఫైనల్ చేరిందంటే అందుకు కారణం రైనానే.
పాకిస్థాన్‌తో మ్యాచ్, అందులోనా వరల్డ్ కప్ సెమీ ఫైనల్.. ఎంత ఒత్తిడి ఉంటుందో ఊహించుకోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు సెహ్వాగ్, సచిన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. సచిన్ 85 పరుగులతో అద్భుతంగా ఆడాడు. కానీ, వాళ్లిద్దరూ అవుటైన తర్వాత మన బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుప్పకూలింది. గంభీర్, కోహ్లీ, యువరాజ్‌సింగ్, ధోని పెద్దగా రాణించలేదు. 37 ఓవర్లలో కేవలం 187 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇలాంటి టైమ్‌లో టీమిండియాకు ఒక ఫైటింగ్ టోటల్‌ను ఇచ్చింది రైనానే.. టెయిలెంటర్లతో కలిసి టీమిండియా స్కోర్‌ను 260కి చేర్చాడు. 39 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. అక్కడ రైనా చేసింది 36 పరుగులే కావచ్చు. కానీ, అవే మ్యాచ్ విన్నింగ్ రన్స్‌గా మారాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 29 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. రైనా గనుక చివర్లో ఆదుకోకుంటే.. టీమిండియా స్కోర్ 220కే పరిమితం అయ్యేది. ఇలా రైనా ఎన్నో మరుపురాని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఇక ఐపీఎల్‌లో రైనా సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనికి డిప్యూటీగా, చెన్నై సూపర్ కింగ్స్‌లో కీ ప్లేయర్‌గా రైనా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రైనాను మిస్టర్ ఐపీఎల్ అని ఎందుకు పిలుస్తారో? ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు.. ఓ ఆటగాడు కేవలం 25 బంతుల్లోనే 87 పరుగులు చేయగలడంటే అది కచ్చితంగా రైనానే. అలాంటి విధ్వంసాలు రైనా అనేకం సృష్టించాడు. అప్పటి వరకు టీమిండియాలో 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు.. ఐపీఎల్ లో వన్‌డౌన్‌లో ఆడేసరికి.. అతని అసలు సిసలు విశ్వరూపం బయటికి వచ్చింది. నిజానికి రైనాను చెన్నై వాడుకున్నట్లు.. టీమిండియాలో వాడుకుని ఉంటే.. ఈ రోజు రైనా ఖాతాలో 70కి పైగా సెంచరీలు ఉండేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి బ్యాటింగ్ చేయగల సత్తా అతనిలో ఉంది. టీమిండియా తరఫున టీ20, వన్డే, టెస్టుల్లో సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడు రైనానే. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడు రైనానే. ఇలా ఎన్నో ఘనతలు అతనికి సెంచరీల రూపంలోనే ఉన్నాయి.
టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా.. ఐపీఎల్ లాంటి రిచ్ లీగ్‌లో తన సత్తా చూపిస్తూ.. టీమిండియాను ఒంటి చేత్తో శాసిస్తున్న ధోని తనకు ప్రాణా స్నేహితుడైనా.. ఏనాడూ టీమిండియాలో తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలని టీమ్ కెప్టెన్‌పై కానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌పై కానీ రైనా ఒత్తిడి తెచ్చిన దాఖలా లేదు. ఒక వేళ తెచ్చినా రైనాను కాదనే వాడు లేడు. ఎందుకంటే అతను దానికి అర్హత కలిగిన ప్లేయర్. అయినా కూడా రైనాకు దేశం, టీమ్, కెప్టెన్.. ఈ మూడే ఇంపార్టెంట్. దేశం కోసం ఆడుతున్నాను.. టీమ్ గెలవాలి.. కెప్టెన్ చెప్పింది వినాలి.. ఇవే రైనాకు తెలిసినవి. అందుకే.. సచిన్, సెహ్వాగ్, గంగూలీ లాంటి వాళ్లకు పోటీ ఇచ్చి.. గంభీర్, యువరాజ్ సింగ్, ధోని లాంటి వాళ్లతో సమవుజ్జీగా నిలిచి, కోహ్లీ, రోహిత్ శర్మలను కూడా తన బ్యాటింగ్‌తో భయపెట్టాడు. ఇలా మూడు తరాలను కవర్ చేసినా.. తన నిస్వార్థమైన వ్యక్తిత్వంతో గొప్ప ఆటగాడిగా నిలిచిపోయాడు. రైనా ఖాతాలో నంబర్స్ లేకపోయినా.. అభిమానుల గుండెల్లో అతనికి స్థానం ఉంది. అందుకే.. హ్యాట్సాఫ్ రైనా.
Suresh Raina | New Edit | Mr. Bombastic | 🔥
Idol @ImRaina 🙌#SureshRaina | @trendRaina pic.twitter.com/zNUG2ADYJO— HarshitMahiRaina73 🇮🇳 (@RainaMahi73) February 15, 2024