iDreamPost
android-app
ios-app

IPL 2024: సన్ రైజర్స్ కీలక నిర్ణయం.. టీమ్ లోకి విధ్వంసకర ఓపెనర్!

  • Author Soma Sekhar Updated - 05:57 PM, Tue - 5 December 23

సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విధ్వంసకర ఓపెనర్ ను టీమ్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విధ్వంసకర ఓపెనర్ ను టీమ్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

  • Author Soma Sekhar Updated - 05:57 PM, Tue - 5 December 23
IPL 2024: సన్ రైజర్స్ కీలక నిర్ణయం.. టీమ్ లోకి విధ్వంసకర ఓపెనర్!

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే.. సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వేలానికి ముందు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో న్యూస్ ఐపీఎల్ వర్గాల్లో వైరల్ గా మారింది. పాండ్యా లాగే మరో ఆటగాడు ఫ్రాంచైజీ మారనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్లేయర్ ను దక్కించుకోవాలని భావిస్తోందట సన్ రైజర్స్ యాజమాన్యం. ఇదే విషయం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జట్టు మరనున్న ఆ విధ్వంసకర ఓపెనర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024 సీజన్ లో మరో భారీ క్యాష్ ఆన్ డీల్ జరగబోతోందని సమాచారం. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ఈ ట్రేడ్ లో భాగంగా గుజరాత్ నుంచి ముంబై టీమ్ కు మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో నడవబోతున్నాడట దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్. లక్నో నుంచి సన్ రైజర్స్ అతడిని ట్రేడ్ చేసుకోనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఇప్పటికే లక్నోతో సన్ రైజర్స్ యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇటు డికాక్ తో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

కాగా.. డికాక్ ను జట్టులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం.. SRHకు గత కొన్ని సీజన్లుగా సరైన ఓపెనింగ్ జోడీ లేదు. దీంతో జట్టు దారుణమైన అపజయాలు మూటగట్టుకుంటూ.. టోర్నీలో విఫలం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ లో దుమ్మురేపిన డికాక్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోందట కావ్య పాప. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో డికాక్ ను రూ. 6.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. అదీకాక అతడిని ఐపీఎల్ 2024 సీజన్ కు కూడా రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో మరోసారి క్యాష్ ఆన్ డీల్ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. డికాక్ టెస్టులకు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. మరి డికాక్ సన్ రైజర్స్ జట్టులోకి వస్తే ఎలా ఉంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.