iDreamPost
android-app
ios-app

నిన్న మ్యాచ్‌ గెలిచినా SRHలో పెద్ద లోపం! సరిదిద్దుకోకుంటే.. ఫ్లే ఆఫ్స్‌లో ఇంటికే?

  • Published May 03, 2024 | 1:25 PM Updated Updated May 03, 2024 | 1:25 PM

Sunrisers Hyderabad, RR vs SRH, IPL 2024: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచినా కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో పెద్ద లోపం కనిపిస్తోంది. అది సరిదిద్దుకోకుంటే.. రాబోయే ప్లే ఆఫ్స్‌లో ఇబ్బందులు తప్పేలా లేవు. మరి ఆ లోపం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Sunrisers Hyderabad, RR vs SRH, IPL 2024: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచినా కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో పెద్ద లోపం కనిపిస్తోంది. అది సరిదిద్దుకోకుంటే.. రాబోయే ప్లే ఆఫ్స్‌లో ఇబ్బందులు తప్పేలా లేవు. మరి ఆ లోపం ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 03, 2024 | 1:25 PMUpdated May 03, 2024 | 1:25 PM
నిన్న మ్యాచ్‌ గెలిచినా SRHలో పెద్ద లోపం! సరిదిద్దుకోకుంటే.. ఫ్లే ఆఫ్స్‌లో ఇంటికే?

ఈ సీజన్‌లో తొలి నుంచి టేబుల్‌ టాపర్‌గా ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడించి.. ప్లే ఆఫ్‌ అవకాశాలు మరింత మెరుగుపర్చుకుంది. గురువారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. రాజస్థాన్‌పై విజయం సాధించి.. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచినా కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓ భయం వెంటాడుతోంది. ఇలాగే కొనసాగితే.. ప్లే ఆఫ్స్‌తోనే ఇంటికి వచ్చేయొచ్చు అనే ఆందోళన క్రికెట్‌ అభిమానుల్లో కూడా మొదలైంది. అసలింతకీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏ విషయంలో భయపడుతోంది? ఈ విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎస్‌ఆర్‌హెచ​ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ జట్టు బలం బౌలింగ్‌. మంచి మంచి బౌలర్లను టీమ్‌లోకి తీసుకుంటూ.. బౌలింగ్‌ బలంతోనే మ్యాచ్‌లు నెగ్గేది. గతంలో ఎస్‌ఆర్‌హెచ్‌ అంటే బౌలింగ్‌ అనే ముద్ర ఉండేది. కానీ, ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అంటే బ్యాటింగ్‌ అనే పేరొచ్చింది. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌, క్లాసెన్‌, మర్కరమ్‌, అబ్దుల్‌ సమద్‌, నితీష్‌ రెడ్డి వేగంగా ఆడుతుండటంతో భారీ భారీ స్కోర్లు సాధించింది. కానీ, తమ ప్రధాన బలమైన బౌలింగ్‌లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ చాలా వీక్‌గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచిన మ్యాచ్‌లన్నీ దాదాపు​ బ్యాటింగ్‌ బలంతోనే గెలిచింది. గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా చాలా క్లిష్టమైన పిచ్‌పై ట్రావిస్‌ హెడ్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్‌ అద్భుతంగా ఆడి 201 పరుగులు చేశారు.

ట్రిక్కి పిచ్‌పై ఇంత పెద్ద టార్గెట్‌ను కాపాడుకోవడానికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఆపసోపాలు పడింది. తొలి ఓవర్‌లోనే రెండు పెద్ద వికెట్లు పడినా కూడా.. చివరి బాల్‌కు కేవలం ఒక్క రన్స్‌ తేడాతో గెలిచింది. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై 202 పరుగుల భారీ టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక్క రన్‌ తేడాతో చావుతప్పి కన్నులొట్టబోయి గెలిచింది అంటే.. బౌలింగ్‌ ఎంత వీక్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. కమిన్స్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచింది. కానీ, లేదంటే రాజస్థాన్‌ సులువుగా గెలిచేది. బాగానే బౌలింగ్‌ వేసి గెలిచారు అని అనిపిస్తున్నా.. ఫ్లే ఆఫ్స్‌ లాంటి కీలక మ్యాచ్‌లలో ఈ బౌలింగ్‌తో గెలవడం కష్టమనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌లో మరింత మెరుగుపడాలి అని క్రికెట్‌ అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్న అభిప్రాయాలపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.