iDreamPost
android-app
ios-app

షాకింగ్ నిర్ణయం తీసుకున్న కావ్య! కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ రిలీజ్

  • Author Soma Sekhar Published - 06:43 PM, Sun - 26 November 23

సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ లో విఫలం అయిన ప్లేయర్లందరిని దాదాపు పక్కన పెట్టింది. అందులో భారీ ధర పెట్టి కొన్న ప్లేయర్ కూడా ఉన్నాడు. ఈ హార్డ్ హిట్టర్ ను కావ్య పాప ఎందుకు వదులుకుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ లో విఫలం అయిన ప్లేయర్లందరిని దాదాపు పక్కన పెట్టింది. అందులో భారీ ధర పెట్టి కొన్న ప్లేయర్ కూడా ఉన్నాడు. ఈ హార్డ్ హిట్టర్ ను కావ్య పాప ఎందుకు వదులుకుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 06:43 PM, Sun - 26 November 23
షాకింగ్ నిర్ణయం తీసుకున్న కావ్య! కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ రిలీజ్

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న 17వ ఎడిషన్ ఐపీఎల్ కప్ కొట్టడమే లక్ష్యంగా యాజమాన్యాలు ముందుకు అడుగులు వేస్తున్నాయి. గత సీజన్ లో దారుణంగా విఫలం అయిన ఆటగాళ్లకు గుడ్ బై చెబుతున్నాయి. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా గత సీజన్ లో విఫలం అయిన ప్లేయర్లందరిని దాదాపు పక్కన పెట్టింది. అందులో భారీ ధర పెట్టి కొన్న ప్లేయర్ కూడా ఉన్నాడు. ఈ హార్డ్ హిట్టర్ ను కావ్య పాప ఎందుకు వదులుకుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ జట్టు దారుణంగా విఫలం అయిన సంగతి మనందరికి తెలిసిందే. దీంతో కళ్లు తెరిచిన యాజమాన్యం వచ్చే ఐపీఎల్ టైటిల్ ను గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కొందరు ఆటగాళ్లకు స్వస్తి పలికింది. అందులో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కూడా ఉండటం విశేషం. అతడిని గత వేలంలో రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ హార్డ్ హిట్టర్ ను సన్ రైజర్స్ రిలీజ్ చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించిందనే చెప్పాలి. గత సీజన్ లో బ్రూక్ 11 మ్యాచ్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. కావ్య పాప ఏ స్ట్రాటజీతో అతడిని రిలీజ్ చేసిందా? అని అందరూ ఆలోచిస్తున్నారు.

కాగా.. బ్రూక్ తో పాటుగా సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకేల్ హోసెన్ ,ఆదిల్ రషీద్ లను కూడా వదులుకుంది సన్ రైజర్స్. కాగా.. రాబోయే సీజన్ కోసం 18 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. వారిలో.. అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ఉపేంద్ర సింగ్ యాదవ్, హెన్రిచ్ క్లాసెన్, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఫజల్హక్ ఫరూకీ, గ్లెన్ ఫిలిప్స్, మర్క్రమ్, అన్మోల్ ప్రీత్ సింగ్, అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, సంవీర్ సింగ్ లు ఉన్నారు. మరి బ్రూక్ ను వదులుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.