iDreamPost
android-app
ios-app

RCBతో మ్యాచ్‌ ఓడిపోయినా.. భారీ రికార్డును ఖాతాలో వేసుకున్న SRH

  • Published Apr 26, 2024 | 12:48 PM Updated Updated Apr 26, 2024 | 12:48 PM

Sunrisers Hyderabad, RCB vs SRH: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైనా.. ఒక అరుదైన రికార్డను తమ ఖాతాలో వేసుకుంది. మరి ఆ రికార్డ్‌ ఏంటి? దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

Sunrisers Hyderabad, RCB vs SRH: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైనా.. ఒక అరుదైన రికార్డను తమ ఖాతాలో వేసుకుంది. మరి ఆ రికార్డ్‌ ఏంటి? దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 26, 2024 | 12:48 PMUpdated Apr 26, 2024 | 12:48 PM
RCBతో మ్యాచ్‌ ఓడిపోయినా.. భారీ రికార్డును ఖాతాలో వేసుకున్న SRH

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి పాలైనా.. ఓ భారీ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆడిన ఆర్సీబీ ఏకంగా 35 రన్స్‌ తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ హోం గ్రౌండ్‌లోనే వారిని ఓడించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమిపాలైనా.. వారి ఖాతాలో చేరిన ఆ అరుదైన రికార్డ్‌ ఏంటో? దాని గురించి పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్‌ చేస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ మినహా ఇస్తే.. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆర్సీబీ గెలిచిన మ్యాచ్‌లు అన్ని బ్యాటింగ్‌ బలంపైనే గెలిచింది. పైగా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా 11 ఏళ్లగా చెక్కుచెదని ఆర్సీబీ 263 పరుగులు స్కోర్‌ రికార్డ్‌ను ఈ సీజన్‌లో ఏకంగా మూడు సార్లు బ్రేక్‌ చేసింది. 266, 277, 287 ఇలా భీకరమైన బ్యాటింగ్‌తో అతి భారీ స్కోర్లు నమోదు చేసింది. ఇంత పెద్ద స్కోర్లు రావడానికి కారణం.. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు ఎంతో సులభంగా, మంచి నీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు కొట్టడమే. ఇప్పుడు ఆ సిక్సుల విషయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రికార్డు సాధించింది.

SRH who have a huge record

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 100 సిక్సులు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలిచింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మొత్తం 108 సిక్సులు కొట్టింది. ఈ 108 సిక్సులను కేవలం 8 మ్యాచ్‌ల్లోనే కొట్టడం విశేషం. వీటిలో హెన్రిచ్‌ క్లాసెన్‌, అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌లే అత్యధిక సిక్సులు కొట్టారు. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తర్వాత 90 సిక్సులతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. అలాగే 86 సిక్సులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో స్థానంలో నిలిచింది. మరి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయినా.. 100 సిక్సులు కొట్టిన తొలి టీమ్‌గా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.