Sunil Gavaskar: సచిన్, నీరజ్ చోప్రా కాదు.. ఇండియాలో ఉన్న గొప్ప క్రీడాకారుడు అతడే: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar: సచిన్, నీరజ్ చోప్రా కాదు.. ఇండియాలో ఉన్న గొప్ప క్రీడాకారుడు అతడే: సునీల్ గవాస్కర్

భారత్ లో ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. అయితే తన దృష్టిలో మాత్రం ఇండియాలో ఉన్న అత్యుత్తమ ప్లేయర్ అతడే అంటూ ఓ లెజెండ్ పేరు చెప్పుకొచ్చాడు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్. ఆ ప్లేయర్ ఎవరంటే?

భారత్ లో ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. అయితే తన దృష్టిలో మాత్రం ఇండియాలో ఉన్న అత్యుత్తమ ప్లేయర్ అతడే అంటూ ఓ లెజెండ్ పేరు చెప్పుకొచ్చాడు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్. ఆ ప్లేయర్ ఎవరంటే?

భారతదేశంలో ఎంతో మంది ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్నారు. క్రికెట్ లో కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్, లక్ష్మణ్, ధోని, కోహ్లీ, రోహిత్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే. అలాగే హాకీలో దిగ్గజం ధ్యాన్ చంద్, రెజ్లింగ్ లో సుశీల్ కుమార్, రవి దహియా, వినేశ్ ఫొగాట్ లతో పాటు ఇంకొందరు స్టార్ రెజ్లర్స్ ఉన్నారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, టెన్నిస్ లో సానియా మీర్జా, లియాండర్ పేస్, మహేశ్ భూపతి. బ్యాట్మింటన్ లో పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు ఇలా అన్ని విభాగాల్లో స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ వీళ్లందరిలో భారత్ లో అత్యుత్తమ క్రీడాకారుడు అతడే అంటూ టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ పేరును చెప్పుకొచ్చాడు.

ఇండియాలో అన్ని క్రీడా విభాగాల్లో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. పైన చెప్పుకున్న వాళ్లతో పాటుగా చాలా మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిథ్యం వహించి.. అద్బుతమైన విజయాలతో అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించారు. అయితే వారందరి కంటే తన దృష్టిలో భారత్ లో ఉన్న అత్యుత్తమ క్రీడాకారుడు బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె అని చెప్పుకొచ్చాడు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్. ఇతర క్రీడాంశాల్లో ఉన్న దిగ్గజ ఆటగాళ్లు అంటే నాకు గౌరవం, అయితే నా దృష్టిలో మాత్రం ప్రకాశ్ పదుకొణె భారత అత్యుత్తమ ప్లేయర్.

“బ్యాడ్మింటన్ లో ప్రకాశ్ పదుకొణె సాధించిన అద్బుతమైన విజయాలతో పాటుగా అతడి ప్రవర్తన నన్ను ఆకట్టుకొన్నాయి. ఆ కాలంలో సర్వ్ చేస్తున్నప్పుడు కూడా పాయింట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రత్యర్థి సర్వ్ చేస్తున్నప్పుడు కూడా పాయింట్ సాధించవచ్చు. ఇలాంటి కఠినమైన నిబంధనల మధ్య ప్రకాశ్ ఆడిన తీరు అమోఘం. అప్పట్లో డెన్మార్క్, చైనా ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో వారిని మట్టికరిపించాడు. ప్రత్యర్థులకు 7 నుంచి 10 పాయింట్లు మాత్రమే ఇచ్చుకునేవాడు” అంటూ టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి సునీల్ గవాస్కర్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments