iDreamPost
android-app
ios-app

MS Dhoni: అతను ధోని కాదు.. నయా యువరాజ్: సునీల్ గవాస్కర్

  • Author Soma Sekhar Published - 05:00 PM, Mon - 11 December 23

ఓ యంగ్ టీమిండియా ప్లేయర్ పై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ పొగడ్తలు కురిపించాడు. ఆ ప్లేయర్ టీమిండియాకు దొరికిన ధోని కాదు.. అతడు మరో యువరాజ్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఆ ఆటగాడు ఎవరో లుక్కేద్దాం పదండి.

ఓ యంగ్ టీమిండియా ప్లేయర్ పై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ పొగడ్తలు కురిపించాడు. ఆ ప్లేయర్ టీమిండియాకు దొరికిన ధోని కాదు.. అతడు మరో యువరాజ్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఆ ఆటగాడు ఎవరో లుక్కేద్దాం పదండి.

  • Author Soma Sekhar Published - 05:00 PM, Mon - 11 December 23
MS Dhoni: అతను ధోని కాదు.. నయా యువరాజ్: సునీల్ గవాస్కర్

టీమిండియాలో ఉడుకు రక్తం ఉరకలేస్తోంది. యంగ్ ప్లేయర్లు అద్భుత ప్రదర్శన చేస్తూ.. జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తున్నారు. జాతీయ జట్టులోకి వస్తున్న ప్రతీ ప్లేయర్ దాదాపు సత్తా చాటుతూనే ఉన్నాడు. దీంతో సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. ఇక తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్న యువ ఆటగాళ్లను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు దిగ్గజ క్రికెటర్లు. ఈ క్రమంలోనే ఓ యంగ్ టీమిండియా ప్లేయర్ పై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ పొగడ్తలు కురిపించాడు. ఆ ప్లేయర్ టీమిండియాకు దొరికిన ధోని కాదు.. అతడు మరో యువరాజ్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. మరి గవాస్కర్ కితాబిచ్చిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

భారత జట్టులోకి యుంగ్ ప్లేయర్లు దూసుకొస్తున్నారు. తమ ఆటతీరుతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకుంటూ.. టీమ్ కు చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నారు. యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ముందు నుంచే సెహ్వాగ్, రోహిత్ లా అటాకింగ్ గేమ్ ఆడుతుంటే.. మరో ఇద్దరు ఓపెనర్లు గిల్, రుతురాజ్ లు టైమ్ ను బట్టి తమ బ్యాట్ కు పనిచెబుతున్నారు. కాగా.. ఈ మధ్య కాలంలో టీమిండియా నయా ఫినిషర్ గా తన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు యువ సంచలనం రింకూ సింగ్. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో చివర్లో వచ్చి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించిన సంగతి తెలిసిందే. రింకూ తన తుపాన్ ఇన్నింగ్స్ లతో టీమిండియా నయా ఫినిషర్ గా ప్రమోషన్ పొందాడు.

దీంతో భారత జట్టుకు మరో ధోని దొరికాడని అందరూ రింకూను ప్రశంసిస్తున్నారు. మహేంద్రుడిలా ప్రశాంతంగా, ఒత్తిడికి గురికాకుండా జట్టుకు విజయాలను అందిస్తున్నాడని కితాబిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం రింకూ సింగ్ ను ధోనితో కాకుండా డాషింగ్ ఆల్ రౌండర్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ తో పోల్చాడు. రింకూ సింగ్ టీమిండియాకు దొరికిన మరో యువరాజ్ అంటూ కితాబిచ్చాడు. “రింకూ సింగ్ పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. అందరికీ టాలెంట్ ఉండదు. కానీ ఏదో ఒక టైమ్ లో మీరు అనుకున్నంత సామర్థ్యం ఉందని తెలుసుకుంటారు. అయితే రింకూ అలా కాదు.. అతడు అనున్నది సాధిస్తాడు. గత మూడేళ్లుగా సత్తాచాటుతూ.. టీమిండియాలో ప్లేస్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ ద్వారా తానేంటో నిరూపించుకుని జాతీయ జట్టులో చోటు దక్కించుకుని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతడిని మరో యువరాజ్ సింగ్ లా అందరూ భావిస్తున్నారు. గతంలో యువీ టీమిండియాకు ఎలాంటి విజయాలను అందించాడో.. రింకూ కూడా అలాంటి విజయాలనే అందిస్తాడు” అంటూ ప్రశంసలు కురిపించాడు సునీల్ గవాస్కర్.

ఇక రింకూ తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా.. ఇటీవల ఆసీస్ తో ముగిసిన టీ20 సిరీస్ లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో 105 పరుగులు చేశాడు రింకూ. అందులో రెండు మ్యాచ్ ల్లో నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాలను అందించాడు. దీంతో సౌతాఫ్రికాతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే ప్రోటీస్ తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండోది మంగళవారం(డిసెంబర్ 12)న జరగనుంది. మరి గవాస్కర్ అన్నట్లుగా రింకూ టీమిండియాకు దొరికిన మరో యువరాజ్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి