iDreamPost
android-app
ios-app

Sunil Gavaskar: సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై టీమిండియా లెజెండ్ ఆగ్రహం! డబ్బుల్లేవా? అంటూ..!

  • Author Soma Sekhar Published - 08:32 PM, Mon - 11 December 23

సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్. మరి భారత లెజెండ్ ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్. మరి భారత లెజెండ్ ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 08:32 PM, Mon - 11 December 23
Sunil Gavaskar: సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై టీమిండియా లెజెండ్ ఆగ్రహం! డబ్బుల్లేవా? అంటూ..!

ఆస్ట్రేలియాపై స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుని ఫుల్ జోష్ లో ఉంది టీమిండియా. ఇక ఇదే జోరును దక్షిణాఫ్రికా పర్యటనలోనూ చూపించాలని భావించింది. కానీ తొలి మ్యాచ్ కు వరుణుడు అడ్డుతగిలి మ్యాచ్ ను టాస్ పడకుండానే ముగించాడు. ఎడతెరపిలేకుండా వర్షం పడటంతో.. మ్యాచ్ ను రద్దు చేశారు అంపైర్లు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఆర్థికంగా ఈ సిరీస్ ఎంతో ముఖ్యమని చెప్పిన సఫారీ క్రికెట్ బోర్డ్.. అందుకు తగ్గ ఏర్పాట్ల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందంటూ ఏకిపారేశాడు.

సౌతాఫ్రికాతో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ పూర్తిగా వర్షార్పణం అయ్యింది. వాన ఎంతటికీ తగ్గకపోవడంతో.. అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ కు సంబంధించి ఏర్పాట్లపై ఫైర్ అయ్యాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.”సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అనుకోలేదు. ఒకవేళ వర్షం ఆగిపోయినా.. ఈ మ్యాచ్ జరగకపోయేది. ఎందుకంటే? అప్పటికే గ్రౌండ్ మెుత్తం పూర్తిగా చిత్తడిగా మారింది. గ్రౌండ్ మెుత్తం కవర్లు కప్పి ఉంచలేదు. మీ దగ్గర కవర్లకు చాలినంత డబ్బులేదా? ప్రతీ క్రికెట్ బోర్డు దగ్గర చాలానే డబ్బు ఉంటుంది. బీసీసీఐ దగ్గర ఉన్నంత మనీ మీ బోర్డులో లేకపోవచ్చు. కానీ కవర్లు కొనేంత సొమ్ము మాత్రం ఉండే ఉంటుందిగా?” అంటూ విమర్శలు గుప్పించాడు. సౌతాఫ్రికా బోర్డుకు ఈ సిరీస్ ఆర్థికంగా ఎంతో ముఖ్యమైందని చెప్పిన వారు.. ఏర్పాట్లలో ఈ విధంగా నిర్లక్ష్యం వహించడం ఏంటని సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి సఫారీ క్రికెట్ బోర్డుపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.