iDreamPost
android-app
ios-app

టీమిండియా వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్.. గూస్ బంప్స్ రావడం పక్కా! వైరల్ వీడియో

  • Published Apr 23, 2024 | 2:50 PM Updated Updated Apr 23, 2024 | 2:50 PM

T20 World Cup 2024 Indian Team Promo: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఓ ప్రత్యేక ప్రోమో వీడియోను విడుదల చేసింది. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.

T20 World Cup 2024 Indian Team Promo: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఓ ప్రత్యేక ప్రోమో వీడియోను విడుదల చేసింది. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.

టీమిండియా వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్.. గూస్ బంప్స్ రావడం పక్కా! వైరల్ వీడియో

ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్నప్పటికీ.. అందరి చూపు మాత్రం జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2024పైనే ఉంది. 20 జట్లు పాల్గొనే ఈ పొట్టి ప్రపంచ కప్ ను చూడాలని ప్రేక్షకులు తెగ ఆరాటపడుతున్నారు. ఇక టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఓ ప్రత్యేక ప్రోమో వీడియోను విడుదల చేసింది. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

టీ20 వరల్డ్ కప్ 2024లో పాల్గొనబోయే టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఓ ప్రత్యేక ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమో టీమిండియా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపుతోంది. ఈ వీడియో చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ రావడం పక్కా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వందేమాతరం సాంగ్ వస్తూ.. రోహిత్, సూర్యకుమార్, పాండ్యా, జడేజాలను చూపించిన తీరు అద్భుతం. ఇక చివర్లో విరాట్ కోహ్లీ సెల్యూట్ చేసిన క్లిప్పింగ్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతోంది. ఇక ఈ వీడియోకు వరల్డ్ కప్ కోసం టీమిండియా సిద్ధం అని అర్థం వచ్చేలా క్యాప్షన్ యాడ్ చేసింది స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను అలరిస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇదిలా USA, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ మెగాటోర్నీలో మెుత్తం 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. నాలుగు గ్రూప్ లు విడిపోయి ఈ జట్లు పోటీపడనున్నాయి. ఇక గ్రూప్-ఏలో ఉన్న ఇండియా-పాకిస్తాన్ జట్లు జూన్ 9న న్యూయార్క్ వేదికగా ఢీకొనబోతున్నాయి. ఈ దాయాదుల సమరం కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ప్రోమో చూసి.. ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş