iDreamPost

వీడియో: RRతో మ్యాచ్‌కి ముందు హార్ధిక్‌ పాండ్యా ఓవర్‌ యాక్షన్‌! మళ్లీ మొదలైన ట్రోల్స్‌

  • Published Apr 23, 2024 | 1:36 PMUpdated Apr 23, 2024 | 1:37 PM

Hardik Pandya, MI vs RR, IPL 2024: టీమ్‌ సరిగ్గా ప్రదర్శన చేయడం లేదు, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, బౌలర్‌గా సొంత ప్రదర్శన కూడా బాగాలేదు.. ఇలాంటి టైమ్‌లో పాండ్యా చేస్తున్న పనులు విమర్శల పాలవుతున్నాయి. ఇప్పుడు ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌లో కూడా పాండ్యా చేసిన పనిపై ట్రోల్స్‌ వస్తున్నాయి. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Hardik Pandya, MI vs RR, IPL 2024: టీమ్‌ సరిగ్గా ప్రదర్శన చేయడం లేదు, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, బౌలర్‌గా సొంత ప్రదర్శన కూడా బాగాలేదు.. ఇలాంటి టైమ్‌లో పాండ్యా చేస్తున్న పనులు విమర్శల పాలవుతున్నాయి. ఇప్పుడు ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌లో కూడా పాండ్యా చేసిన పనిపై ట్రోల్స్‌ వస్తున్నాయి. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Apr 23, 2024 | 1:36 PMUpdated Apr 23, 2024 | 1:37 PM
వీడియో: RRతో మ్యాచ్‌కి ముందు హార్ధిక్‌ పాండ్యా ఓవర్‌ యాక్షన్‌! మళ్లీ మొదలైన ట్రోల్స్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోరంగా ఓడిపోయింది. సీజన్‌లో ముంబైకి ఇది ఐదో ఓటమి. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని ఎంఐ ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేప్టటినప్పటి నుంచి దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్న హార్ధిక్‌ పాండ్యా.. సోమవారం ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌ సందర్భంగా చేసిన ఓ పనితో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.‘ఇందుకే కదా పాండ్యా నిన్న అంతా తిడుతుంది’, ‘ఇలాంటి ఓవర్‌ యాక్షన్లు తగ్గించు’ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పాండ్యాను ట్రోల్‌ చేస్తున్నారు. అసలు ఇంతకీ పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

ఆర్‌ఆర్‌తో కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. హార్ధిక్‌ పాండ్యా డగౌట్‌లో తన బ్యాటింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే బౌండరీ లైన్‌ పక్కన డిప్స్‌ తీస్తూ కనిపించాడు. అంతే నెటిజన్లు పాండ్యాను ట్రోల్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఇలాంటి పనులు డ్రెస్సింగ్‌ రూమ్‌లో చేసుకోవచ్చు కదా.. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే.. బ్యాటింగ్‌కి ముందు ఇంత ఓవర్‌ యాక్షన్‌ చేసిన పాండ్యా.. బ్యాటింగ్‌కు దిగి పట్టుమని పది పరుగులు చేయలేదు. పది బంతులు ఆడిన పాండ్యా సరిగ్గా పది రన్స్‌ మాత్రమే చేసి.. అవుట్‌ అయ్యాడు. ఇంత మాత్రం దానికి ఎందుకయ్యా అంత ఓవర్‌ యాక్టింగ్‌ అంటూ ఫ్యాన్స్‌ కూడా పాండ్యాను తిడుతున్నారు.

 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ విఫలమైనా, వన్‌ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ పెద్దగా రన్స్‌ చేయకుండా అవుట్‌ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. అయితే.. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ 45 బంతుల్లో 65, నేహాల్‌ 24 బంతుల్లో 49 పరుగులతో రాణించారు. చివర్లో టిమ్‌ డేవిడ్‌, హార్ధిక్‌ పాండ్యా దారుణంగా విఫలం అయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ 5 వికెట్లతో రాణించి, ముంబై ఇండియన్స్‌ పతనాన్ని శాసించాడు. ఇక 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 18.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి 183 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 60 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచి రాజస్థాన్‌ను గెలిపించాడు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ 38(నాటౌట్‌), ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ 35 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి ముందు హార్ధిక్‌ పాండ్యా చేసిన ఓవర్‌ యాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి