iDreamPost
android-app
ios-app

వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ప్రకటన! 8 మంది మనోళ్లే

స్టార్ స్పోర్ట్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించింది. ఈ టీమ్ లో ఏకంగా భారత జట్టు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఈ టీమ్ లో హిట్ మ్యాన్, శుభ్ మన్ గిల్, కింగ్ కోహ్లీ టాప్ ఆర్డర్ లో ఉన్నారు.

స్టార్ స్పోర్ట్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించింది. ఈ టీమ్ లో ఏకంగా భారత జట్టు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఈ టీమ్ లో హిట్ మ్యాన్, శుభ్ మన్ గిల్, కింగ్ కోహ్లీ టాప్ ఆర్డర్ లో ఉన్నారు.

వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ప్రకటన! 8 మంది మనోళ్లే

వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో టీమిండియా ప్లేయర్స్ అదరగొట్టారు. ఏకంగా భారత జట్టు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా మొత్తం 8 మంది భారత ఆటగాళ్లు వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో చోటు దక్కించుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించింది. ఈ టీమ్ లో హిట్ మ్యాన్, శుభ్ మన్ గిల్, కింగ్ కోహ్లీ టాప్ ఆర్డర్ లో ఉన్నారు. ఈ టీమ్‌లో భారత స్టార్ ఓపెనర్ జోడీ రోహిత్-గిల్ ఎంపికయ్యారు. ఇక ఈ టీమ్ లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆసిస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కు మాత్రం చోటు దక్కలేదు.

ఇక స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు వరుసగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, కేఎల్ రాహుల్, హెన్రిచ్ క్లాసెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఇక స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 స్వ్కాడ్ లో భారత టాప్ ఆర్డర్ మొత్తం చోటుదక్కించుకుని ఆదిపత్యాన్ని చెలాయించింది. వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా నుంచి బ్యాటింగ్ విభాగంలో రోహిత్, కోహ్లీ, గిల్, రాహుల్ అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

అదే విధంగా బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా, షమీ, సిరాజ్ లకు చోటు దక్కింది. ఏ ఫాస్ట్ బౌలర్ కు కూడా చోటుదక్కలేదు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోగా ఆసిస్ ఆటగాడు ఆడమ్ జంపా ఎంపికయ్యాడు. ఈ టీమ్ లో టీమిండియా నుంచి ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు ఎంపికవ్వడంతో భారత్ బలమైన జట్టు అని మరోసారి నిరూపితమైంది. మరి వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 లో 8 మంది టీమిండియా ఆటగాళ్లు ఎంపికవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి