iDreamPost
android-app
ios-app

పసికూనలా ఉన్న లంకను బెబ్బులిలా మార్చాడు.. రియల్ టైగర్ జయసూర్య!

  • Published Sep 23, 2024 | 5:18 PM Updated Updated Sep 23, 2024 | 5:18 PM

Sanath Jayasuriya, SL vs NZ: ఒకప్పుడు వరల్డ్ క్రికెట్​ను శాసించిన శ్రీలంక.. క్రమంగా పసికూన రేంజ్​కు పడిపోయింది. చెత్త పెర్ఫార్మెన్స్​తో సొంత అభిమానుల నుంచి కూడా విమర్శలపాలైంది. అయితే ఆ టీమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

Sanath Jayasuriya, SL vs NZ: ఒకప్పుడు వరల్డ్ క్రికెట్​ను శాసించిన శ్రీలంక.. క్రమంగా పసికూన రేంజ్​కు పడిపోయింది. చెత్త పెర్ఫార్మెన్స్​తో సొంత అభిమానుల నుంచి కూడా విమర్శలపాలైంది. అయితే ఆ టీమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

  • Published Sep 23, 2024 | 5:18 PMUpdated Sep 23, 2024 | 5:18 PM
పసికూనలా ఉన్న లంకను బెబ్బులిలా మార్చాడు.. రియల్ టైగర్ జయసూర్య!

ఒకప్పుడు వరల్డ్ క్రికెట్​ను శాసించింది శ్రీలంక. చిన్న దేశమే అయినా క్రికెట్​లో మాత్రం బిగ్ టీమ్​గా హవా నడిపించింది. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. ఇలా అన్ని ఇతర బడా జట్లను వణికించింది. మురళీధరన్, దిల్షాన్, సంగక్కర, జయవర్దనే, చమిందా వాస్, మలింగ లాంటి ఆటగాళ్లతో కూడిన టీమ్ అన్ని ఫార్మాట్లలోనూ డేంజరస్ ఎలెవన్​గా పేరు తెచ్చుకుంది. ఐసీసీ టోర్నీల్లో కనీసం సెమీస్ లేదా ఫైనల్స్​కు చేరుకుంటూ ఆధిపత్యం చలాయించింది. ఈ క్రమంలో కొన్ని బిగ్ ట్రోఫీస్ కూడా ఎగరేసుకుపోయింది. అయితే పైన చెప్పిన లెజెండ్స్ రిటైర్మెంట్​తో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయింది లంక టీమ్. వరుస వైఫల్యాలతో ఇంటా బయట విమర్శల పాలైంది. వరల్డ్ కప్స్​లో లీగ్ దశకే పరిమితమవుతూ పసికూన కంటే దారుణమైన ఆటతీరుతో ట్రోలింగ్​కు గురైంది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఒక యోధుడు లంక రాత మార్చేశాడు. అతడే జయసూర్య.

చెత్తాటతో దారుణంగా విమర్శలపాలవుతున్న లంక జట్టులో తక్కువ గ్యాప్​లో భారీ మార్పు వచ్చేసింది. స్వల్ప వ్యవధిలో ఆ టీమ్ అనూహ్య విజయాలు సాధించింది. పసికూనగా ఉన్న ఆ జట్టును బెబ్బులిలా మార్చాడు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య. అతడి గైడెన్స్​లో రీసెంట్​గా టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్​లో నెగ్గిన లంక.. ఆ తర్వాత ఇంగ్లండ్​ను వాళ్ల సొంతగడ్డపై టెస్టుల్లో ఓడించింది. సిరీస్​ పోయినా ఆఖరి టెస్టులో ఇంగ్లీష్​ టీమ్​ను మట్టికరిపించింది. ఇప్పుడు న్యూజిలాండ్​ను కూడా టెస్టుల్లో ఓడించింది. భారత్​పై సిరీస్ గెలుపు గాలివాటం అని తీసిపారేసినా.. ఇంగ్లండ్​ను వాళ్ల సొంతగడ్డపై ఓడించడం మామూలు విషయం కాదు. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ లాంటి తోపు ప్లేయర్లు ఉన్న కివీస్​ను లాంగ్ ఫార్మాట్​లో చిత్తు చేయడం బిగ్ అఛీవ్​మెంట్ అనే చెప్పాలి.

లంక క్రికెట్​ బోర్డు వ్యవహారాల్లో బిజీగా ఉన్న జయసూర్య ఆ జట్టు కోచింగ్ బృందంలోకి రావడంతో మొత్తం మారిపోయింది. ఓడితే కొత్తగా పోవడానికేమీ లేదు.. అదే గెలిస్తే మళ్లీ గౌరవం, పేరు ప్రతిష్టలు వస్తాయని టీమ్​లో కసి పెంచాడు జయసూర్య. ప్రతి ప్లేయర్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టాడు. వాళ్లను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ అండగా నిలబడ్డాడు. ఫెయిల్ అయినా ప్లేస్ పక్కా అనే ధీమా కల్పించాడు. పతుమ్ నిస్సంక, మిలాన్ రత్ననాయకే, లాహిరు కుమార లాంటి యంగ్​స్టర్స్​కు వరుస ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. టీమ్​కు ఫియల్​లెస్ అప్రోచ్ అలవాటు చేశాడు. పాజిటివ్ ఇంటెంట్​తో ఆడేలా ప్రోత్సహించాడు.

గెలుపోటములు కాదు.. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే ముఖ్యమని గ్రహించేలా చేశాడు కోచ్ జయసూర్య. అతడి కోచింగ్, గైడెన్స్ వల్లే బడా టీమ్స్​పై కూడా లంక అద్భుత విజయాలు సాధిస్తోంది. వరుస సక్సెస్​లు వస్తున్నాయి. ఇదే కాన్ఫిడెన్స్​తో భవిష్యత్తులో జట్టు మరింత బాగా ఆడే అవకాశం ఉంది. టీమ్ అన్ని విభాగాల్లో సెట్ అవుతోంది. కాబట్టి ఫ్యూచర్​లో అది మరింత స్ట్రాంగ్​, పవర్​ఫుల్​ ఎలెవన్​గా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు క్రికెట్​ను ఏలిన లంక.. మళ్లీ పునర్వైభవం దిశగా గట్టిగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఆ టీమ్ ఆటపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అద్భుతంగా ఆడుతోందని.. ఇలాగే ఆడుతూ పోతే డేంజరస్ టీమ్​గా మారడం ఖాయమని చెబుతున్నారు. క్రెడిట్ ప్లేయర్లతో పాటు జయసూర్యకు ఇవ్వాలని చెబుతున్నారు. అతడు రియల్ టైగర్ అని మెచ్చుకుంటున్నారు. మరి.. లంక టీమ్ సక్సెస్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.