Sanath Jayasuriya Says Good Bye To Sri Lanka: శ్రీలంక టీమ్​కు జయసూర్య గుడ్​బై.. సిరీస్ గెలిచిన ఆనందంలో ఉండగానే..!

Sanath Jayasuriya: శ్రీలంక టీమ్​కు జయసూర్య గుడ్​బై.. సిరీస్ గెలిచిన ఆనందంలో ఉండగానే..!

India vs Sri Lanka: శ్రీలంక జట్టు ఇప్పుడు సెలబ్రేషన్స్​లో బిజీగా ఉంది. భారత్​ లాంటి టాప్ టీమ్​పై సిరీస్ నెగ్గడంతో సంబురాల్లో మునిగిపోయారు సింహళ ఆటగాళ్లు.

India vs Sri Lanka: శ్రీలంక జట్టు ఇప్పుడు సెలబ్రేషన్స్​లో బిజీగా ఉంది. భారత్​ లాంటి టాప్ టీమ్​పై సిరీస్ నెగ్గడంతో సంబురాల్లో మునిగిపోయారు సింహళ ఆటగాళ్లు.

శ్రీలంక జట్టు ఇప్పుడు సెలబ్రేషన్స్​లో బిజీగా ఉంది. భారత్​ లాంటి టాప్ టీమ్​పై సిరీస్ నెగ్గడంతో సంబురాల్లో మునిగిపోయారు సింహళ ఆటగాళ్లు. టీ20 సిరీస్​లో వైట్​వాష్ అయినా వెంటనే తేరుకొని వన్డే సిరీస్​లో టీమిండియాకు షాక్ ఇచ్చింది శ్రీలంక. ఆ సిరీస్​ను 2-0 తేడాతో గెలుచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్పెషలిస్ట్ ప్లేయర్లు ఉన్న టాప్ టీమ్​ను ఓడించడంతో వాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. సిరీస్ స్టార్ట్ అవడానికి ముందు ఎవరూ దీన్ని ఊహించలేదు. లంక పోటీ ఇస్తే అదే గొప్ప అనుకున్నారు. కానీ వరుస మ్యాచుల్లో రోహిత్ సేనను ఓడించి సిరీస్​ను సొంతం చేసుకుంటుందని అనుకోలేదు.

భారత్​పై వన్డే సిరీస్​లో నెగ్గడం లంకకు 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్పుడు జట్టులో సభ్యుడిగా ఉన్న సనత్ జయసూర్య ఇప్పుడు కూడా ఆ టీమ్​తో ట్రావెల్ అవుతున్నాడు. ఆ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్​గా బాధ్యతలు చేపట్టిన ఈ దిగ్గజం.. వన్డే సిరీస్​లో టీమ్​ గెలుపు కోసం చాలా కృషి చేశాడు. ఈ టూర్ మొదలవక ముందు రాజస్థాన్ రాయల్స్ టీమ్ హైపెర్ఫార్మెన్స్ డైరెక్టర్​గా ఉన్న జుబిన్ భరూచాను పిలిపించి ఆటగాళ్లకు స్పెషల్ కోచింగ్ ఇప్పించాడు. క్రీజులో నిలదొక్కుకోవడం, భారీ ఇన్నింగ్స్​లు ఆడటం ఎలాగో నేర్పించాడు. అలాగే లంక స్పిన్నర్లలో ధైర్యం నూరిపోశాడు. భారత్​పై గెలవగలమనే భరోసాను ఇచ్చి ఆడించాడు. ఇది వర్కౌట్ అయింది. అయితే ఆ జట్టు విజయం కోసం ఇంతగా ప్రయత్నించిన జయసూర్య టీమ్​ను వీడేందుకు సిద్ధమయ్యాడు.

లంక తాత్కాలిక కోచ్​గా ఉన్న జయసూర్య త్వరలో తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. నెక్స్ట్ ఇంగ్లండ్​తో జరిగే సిరీస్ తర్వాత అతడు కోచింగ్ నుంచి తప్పుకొని లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో బిజీ అవనున్నాడు. రెగ్యులర్ కోచ్ లేకపోవడంతో రెండు సిరీస్​ల కోసం ఆ రోల్​లోకి వచ్చిన జయసూర్య.. ఇంకొన్ని రోజుల్లో దిగిపోనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జయసూర్యే తెలిపాడు. తమ టీమ్​కు ఓ మంచి పర్మినెంట్ కోచ్ రావాలని, జట్టును విజయాలబాటలో నడిపే వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపాడు. భారత్ లాంటి టాప్ టీమ్​పై సిరీస్ నెగ్గడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. తమ జట్టు ఎంతో బాగా ఆడిందని మెచ్చుకున్నాడు. లంక టీమ్​లో మంచి టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారని.. వాళ్లను సానబెడితే తిరుగుండదన్నాడు. అయితే జయసూర్య కోచింగ్ బాగుందని, సక్సెస్ అందించిన అతడు ఇంకొన్నాళ్లు ఆ రోల్​లో కొనసాగాలని లంక ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Show comments