iDreamPost
android-app
ios-app

IND vs SL: లంక టూర్​లో మైనస్​లే కాదు.. ప్లస్​లూ ఉన్నాయి.. ఇద్దరు ఫ్యూచర్ స్టార్స్ దొరికేశారు!

  • Published Aug 08, 2024 | 6:25 PM Updated Updated Aug 08, 2024 | 6:25 PM

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్​ భారత్​కు ఎప్పటికీ మర్చిపోని షాక్ ఇచ్చింది. స్టార్లతో నిండిన మన టీమ్​ను ఆతిథ్య జట్టు ఇంత ఈజీగా ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ సిరీస్​తో మైనస్​లే కాదు.. కొన్ని ప్లస్​ పాయింట్లూ ఉన్నాయి.

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్​ భారత్​కు ఎప్పటికీ మర్చిపోని షాక్ ఇచ్చింది. స్టార్లతో నిండిన మన టీమ్​ను ఆతిథ్య జట్టు ఇంత ఈజీగా ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ సిరీస్​తో మైనస్​లే కాదు.. కొన్ని ప్లస్​ పాయింట్లూ ఉన్నాయి.

  • Published Aug 08, 2024 | 6:25 PMUpdated Aug 08, 2024 | 6:25 PM
IND vs SL: లంక టూర్​లో మైనస్​లే కాదు.. ప్లస్​లూ ఉన్నాయి.. ఇద్దరు ఫ్యూచర్ స్టార్స్ దొరికేశారు!

శ్రీలంక టూర్​ భారత్​కు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. తొలుత జరిగిన టీ20 సిరీస్​ను 3-0 తేడాతో క్లీన్​స్వీప్ చేసింది టీమిండియా. అదే ఊపులో వన్డే సిరీస్​ను కూడా వైట్​వాష్​ను చేస్తుందని అంతా అనుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లంతా వన్డే టీమ్​లోకి రావడంతో ఇక జట్టుకు తిరుగులేదు.. లంకను మడతబెట్టేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఆ టీమ్ క్లీన్​స్వీప్ తప్పించుకుంటే అదే గొప్ప అని అనుకున్నారు. అయితే సీన్ కట్ చేస్తే.. సిరీస్​ను 0-2 తేడాతో కోల్పోయింది మెన్ ఇన్ బ్లూ. తొలి మ్యాచ్ టై అవగా.. మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్​ను ఆతిథ్య జట్టుకు అప్పగించింది భారత్.

బ్యాటింగ్ ఫెయిల్యూర్, లంక కండీషన్స్​కు అలవాటు పడకపోవడం, టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం, స్పిన్ బౌలింగ్​ను ఎదుర్కోవడంలో ఉన్న వీక్​నెస్, బౌలర్లు తమ రేంజ్​కు తగ్గట్లు పెర్ఫార్మ్ చేయకపోవడం.. ఇలా రోహిత్ సేన పరాభవానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. స్టార్లతో నిండిన మన టీమ్​ను ఆతిథ్య జట్టు ఇంతలా ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ సిరీస్​తో మైనస్​లే కాదు.. కొన్ని ప్లస్​ పాయింట్లూ ఉన్నాయి. ఈ టూర్​తో భారత్​కు ఇద్దరు ఫ్యూచర్ స్టార్లు దొరికారు. వాళ్లే రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్. ఈ ఇద్దరు ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్​తో ఆకట్టుకున్నారు. అటు టీ20 సిరీస్​లోనూ, ఇటు వన్డే సిరీస్​లోనూ సత్తా చాటారు.

టీ20 సిరీస్​లో ఫస్ట్ మ్యాచ్​లో 3 వికెట్లు తీశాడు పరాగ్. ఆ తర్వాతి మ్యాచుల్లో వికెట్లు తీయకపోయినా పరుగులు ఇవ్వకుండా లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. వన్డే సిరీస్​లో ఒకే మ్యాచ్​లో ఛాన్స్ రాగా.. అందులో 3 వికెట్లు తీసి తన స్పిన్ పవర్ చూపించాడు. బ్యాటింగ్​లో మోస్తరుగా రాణించిన రియాన్​కు భారీ ఇన్నింగ్స్​లు ఆడే సత్తా ఉంది. భవిష్యత్తులో అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే త్రీ ఫార్మాట్​ ప్లేయర్​గా ఎదిగే ఛాన్స్ ఉంది. ఇక, సుందర్ టీ20 సిరీస్​లో ఒకే మ్యాచ్​లో ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో 18 బంతుల్లో 25 పరుగులు చేశాడు. వన్డే సిరీస్​లో రెండు మ్యాచుల్లో 4 వికెట్లు పడగొట్టడమే గాక బ్యాట్​తోనూ రాణించాడు.

వన్డే సిరీస్​లో అయ్యర్, సిరాజ్, పంత్ లాంటి కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. కానీ పరాగ్, సుందర్ రూపంలో ఇద్దరు టాలెంటెడ్ స్టార్లు దొరికారు. వీళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా కీలక పాత్ర పోషించేలా కనిపిస్తున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగలగడం, మంచి ఫీల్డర్లు కూడా కావడంతో వీళ్లు ఆల్​రౌండర్లుగా జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది. కోచ్ గంభీర్ సానబెట్టి, ఛాన్సులు ఇవ్వాలే గానీ భారత క్రికెట్​ను ఏళ్ల పాటు భుజాలపై మోస్తామనే నమ్మకాన్ని కల్పించారు. మరి.. పరాగ్-సుందర్ కెరీర్​లో ఎక్కడి వరకు చేరుకుంటారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.