iDreamPost
android-app
ios-app

సొంతగడ్డపై ఇంగ్లండ్​ను చిత్తుగా ఓడించిన శ్రీలంక.. అసలు క్రెడిట్ అతడికే!

  • Published Sep 09, 2024 | 6:36 PM Updated Updated Sep 09, 2024 | 7:03 PM

ENG vs SL, Pathum Nissanka: శ్రీలంక జట్టు అద్భుతం చేసి చూపించింది. తమను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్​ను వాళ్ల సొంతగడ్డ మీదే మట్టికరిపించింది. ఈ విక్టరీకి అసలు క్రెడిట్ అతడికే ఇవ్వాలి.

ENG vs SL, Pathum Nissanka: శ్రీలంక జట్టు అద్భుతం చేసి చూపించింది. తమను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్​ను వాళ్ల సొంతగడ్డ మీదే మట్టికరిపించింది. ఈ విక్టరీకి అసలు క్రెడిట్ అతడికే ఇవ్వాలి.

  • Published Sep 09, 2024 | 6:36 PMUpdated Sep 09, 2024 | 7:03 PM
సొంతగడ్డపై ఇంగ్లండ్​ను చిత్తుగా ఓడించిన శ్రీలంక.. అసలు క్రెడిట్ అతడికే!

ప్రస్తుత క్రికెట్​లో మోస్ట్ డేంజరస్ టీమ్స్​లో ఇంగ్లండ్ ఒకటి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్​లో వాళ్లను ఆపడం అంత ఈజీ కాదు. అందునా సొంతగడ్డపై ఎదురులేని రికార్డు ఉన్న ఇంగ్లీష్ టీమ్​తో మ్యాచులు అంటేనే అందరూ భయపడతారు. పెద్ద జట్లు కూడా ఇంగ్లండ్ టూర్​ అంటే వణికిపోతాయి. అక్కడి పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ కండీషన్స్, అనూహ్యమైన స్వింగ్ అంటే జడుసుకుంటాయి. సొంతగడ్డపై ఇంగ్లండ్​ను ఓడించడం అనేది చాలా టీమ్స్ డ్రీమ్. సొంతగడ్డపై బెబ్బులిలా విజృంభించి ఆడే ఇంగ్లీష్ టీమ్​ను ఆపడం మామూలు విషయం కాదు. కానీ శ్రీలంక జట్టు అద్భుతం చేసి చూపించింది. తమను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్​ను వాళ్ల సొంతగడ్డ మీదే మట్టికరిపించింది. మూడు టెస్టుల సిరీస్​ను 1-2తో ముగించింది. తొలి రెండు టెస్టుల్లో ఓడిన లంక.. ఆఖరి టెస్ట్​లో ఆతిథ్య జట్టును షేక్ చేసింది.

మూడో టెస్ట్​లో బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ అదరగొట్టిన లంక.. ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ టీమ్ విసిరిన 219 పరుగుల టార్గెట్​ను 2 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో క్లాసికల్ బ్యాటింగ్​తో ఇంప్రెస్ చేసిన ఓపెనర్ పతుమ్ నిస్సంక.. రెండో ఇన్నింగ్స్​లోనూ దుమ్మురేపాడు. 124 బంతుల్లో 127 పరుగుల ధనాధన్ బ్యాటింగ్​తో టార్గెట్​ను ఉఫ్​మని ఊదేశాడు. అతడికి కుశాల్ మెండిస్ (39), వెటరన్ ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) మంచి సహకారం అందించారు. క్రిస్ వోక్స్​ సహా ఇంగ్లండ్ బౌలర్లు అందర్నీ లంక బ్యాటర్లు ఉతికి ఆరేశారు. ఏ దశలోనూ ఆ టీమ్ గెలుస్తుందని అనిపించలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో పర్యాటక జట్టును 263 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్ బౌలర్లు సెకండ్ ఇన్నింగ్స్​లో పూర్తిగా తేలిపోయారు. వికెట్ల సంగతి పక్కనబెడితే పరుగులు కట్టడి చేయలేకపోయారు.

లంక ఓపెనర్ నిస్సంక ప్రత్యర్థి జట్టును ఏ దశలోనూ కోలుకోకుండా చేశాడు. ఆరంభం నుంచే అతడు భారీ షాట్లు బాదుతూ పోయాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్ కూడా చెలరేగిపోయాడు. వచ్చిన బౌలర్​ను వచ్చినట్లు బాదేశారు. ఇద్దరూ బౌండరీల వర్షం కురిపించాడు. నిస్సంక 13 ఫోర్లు, 2 సిక్సులతో టెస్టును టీ20 తరహాలో ఆడేశాడు. దీంతో ఇంగ్లీష్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. మెండిస్ ఔట్ అయినా ఆ తర్వాత వచ్చిన మాథ్యూస్ ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. మాథ్యూస్ వికెట్లు కాపాడితే.. నిస్సంక భారీ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్​ను త్వరగా ఫినిష్ చేశాడు. ఈ సక్సెస్​కు ఎక్కువ క్రెడిట్ లంక తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్యకు ఇవ్వాల్సిందే. అతడి కోచింగ్​లో ఆ టీమ్ భారత్​తో వన్డే సిరీస్​ను గెలుచుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్​ను వాళ్ల సొంతగడ్డిపై చిత్తు చేసింది. యువకులతో కూడిన టీమ్​ను అతడు వెనుక నుంచి నడిపించిన తీరు, అవసరాలకు తగ్గట్లు ఆటగాళ్ల టాలెంట్​ను వాడుకోవడం మెచ్చుకోవాల్సిందే. అందుకే విక్టరీ కొట్టగానే లంక ప్లేయర్లంతా జయసూర్య దగ్గరకు వెళ్లారు. అతడ్ని హగ్ చేసుకున్నారు.