iDreamPost
android-app
ios-app

IND vs SL: టీమిండియాతో సిరీస్‌.. స్క్వౌడ్‌ను ప్రకటించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు!

  • Published Jul 23, 2024 | 11:45 AM Updated Updated Jul 23, 2024 | 11:46 AM

IND vs SL, Sri Lanka Squad: మరో నాలుగు రోజుల్లో టీమిండియాతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక క్రికెట్‌ బోర్డు తమ స్వ్వౌడ్‌ను ప్రకటించింది. మరి ఆ టీమ్‌లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

IND vs SL, Sri Lanka Squad: మరో నాలుగు రోజుల్లో టీమిండియాతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక క్రికెట్‌ బోర్డు తమ స్వ్వౌడ్‌ను ప్రకటించింది. మరి ఆ టీమ్‌లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 23, 2024 | 11:45 AMUpdated Jul 23, 2024 | 11:46 AM
IND vs SL: టీమిండియాతో సిరీస్‌.. స్క్వౌడ్‌ను ప్రకటించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు!

టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ కోసం 16 మందితో కూడిన స్వ్క్వౌడ్‌ను ప్రకటించింది శ్రీలంక క్రికెట్‌ బోర్డు. ఇప్పటికే భారత జట్టు శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడేందుకు లంక గడ్డపై అడుగుపెట్టేసింది. శ్రీలంక కంటే ముందే భారత సెలెక్టర్లు 15 మందితో కూడా స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. చరిత అసలంక కెప్టెన్సీలో మంచి టీమ్‌ను ప్రకటించింది లంక క్రికెట్‌ బోర్డు. అయితే.. ఈ నెల 27 నుంచి ఆగస్టు 7 వరకు టీమిండియా లంకలో పర్యటించనుంది. తొలుత మూడు టీ20లు, తర్వాత మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆధర్వంలో యంగ్‌ టీమిండియా.. సోమవారమే శ్రీలంకకు చేరుకుంది. 27, 28, 30 తేదీల్లో పల్లెకలె క్రికెట్‌ స్టేడియంలోనే మూడు టీ20లు జరగనున్నాయి. అయితే.. శ్రీలంక కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే జట్టును ప్రకటించింది. వన్డే సిరీస్‌కు ఇంకా ప్రకటించలేదు. కానీ, భారత సెలెక్టర్లు మాత్రం.. టీ20, వన్డే సిరీస్‌కు జట్లను ఎంపిక చేశారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని వన్డే టీమ్‌ త్వరలోనే లంకకు బయలుదేరి వెళ్లనుంది. అయితే.. టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌ కోసం శ్రీలంక ప్రకటించిన స్క్వౌడ్‌లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

  • శ్రీలంక స్క్వౌడ్‌
    చరిత్ అసలంక – కెప్టెన్
    పాతుమ్ నిస్సంక
    కుసల్ జనిత్ పెరీరా
    అవిష్క ఫెర్నాండో
    కుసాల్ మెండిస్
    దినేష్ చండిమాల్
    కమిందు మెండిస్
    దాసున్ షనక
    వానిందు హసరంగా
    దునిత్ వెల్లలాగే
    మహేశ్ తీక్షణ
    చమిందు విక్రమసింఘే
    మతీష పతిరన
    నువాన్ తుషార
    దుష్మంత చమీర