SNP
SRH vs LSG, IPL 2024: ఐపీఎల్ 2024లో అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే.. బుధవారం సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో మ్యాచ్ ఎంతో ఇంపార్టెంట్‌గా మారింది. మీరు కూడా మిస్ కాకుండా చూడండి. ఈ మ్యాచ్ ఎవరికి ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం..
SRH vs LSG, IPL 2024: ఐపీఎల్ 2024లో అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే.. బుధవారం సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో మ్యాచ్ ఎంతో ఇంపార్టెంట్‌గా మారింది. మీరు కూడా మిస్ కాకుండా చూడండి. ఈ మ్యాచ్ ఎవరికి ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ కోసం దాదాపు అన్ని జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. సీజన్ ముగింపు దశకు వచ్చినా.. ఏ జట్టు కూడా ఇంకా అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరలేదు, ఏ జట్లు అధికారికంగా ఎలిమినేట్ కాదు అంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత టఫ్‌గా ఉందో. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే.. కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్సులు మెండుగా ఉన్నాయి. ఆ రెండు జట్లు ఆల్‌మోస్ట్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లిపోయినట్లే భావించాలి. అలాగే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు చాలా సంక్లిష్టమైన అవకాశాలు ఉన్నాయి.
కానీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ మాత్రం మిగిలిన రెండు స్థానాల కోసం హోరాహోరీగా పోటీ పడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ ఎంతో కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ కూడా 11 మ్యాచ్‌లు ఆడి.. ఆరేసి విజయాలతో 12 పాయింట్లతో ఉన్నాయి. సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో, లక్నో ఐదో స్థానంలో ఉంది.
సేమ్ పాయింట్లు ఉన్నా.. మెరుగైన రన్‌రేట్‌తో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో స్థానంలో నిలిచింది. రెండు జట్లు కూడా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్‌రేట్‌తో కచ్చితంగా రెండు విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు జట్లు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఏ టీమ్ విజయం సాధిస్తే వారికే ప్లే ఆఫ్స్ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఎస్‌ఆర్‌హెచ్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే తర్వాతి మ్యాచ్‌ల్లో గుజరాత్, పంజాబ్‌తో హైదరాబాద్‌లోనే సన్‌రైజర్స్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ రెండు టీమ్స్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. పైగా సొంత మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు అడ్వాంటేజ్ ఉంటుంది. మరోవైపు లక్నో.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ తర్వాత ఢిల్లీ, ముంబైతో ఆడాలి. ఆ రెండు టీమ్స్ ఇప్పుడు చాలా డేంజర్‌గా ఆడుతున్నాయి. అందుకే ఎస్‌ఆర్‌హెచ్‌పై ఎలాగైనా గెలిచి తీరాలని లక్నో భావిస్తోంది. అందుకే సన్‌రైజర్స్, లక్నో మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SRH’s last 3 matches:
Vs LSG (Home).
Vs GT (Home).
Vs PBKS (Home).– SRH have to win 2/3 to qualify for the Playoffs. pic.twitter.com/E89kaMu7t2
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 6, 2024