SNP
SRH vs KKR Prediction, IPL 2024: ఐపీఎల్ సీజన్ 2024లో మూడో మ్యాచ్‌లో కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతుంది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచేది ఎవరో? ఎవరి బలాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం..
SRH vs KKR Prediction, IPL 2024: ఐపీఎల్ సీజన్ 2024లో మూడో మ్యాచ్‌లో కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతుంది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచేది ఎవరో? ఎవరి బలాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా మూడో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్‌లకు ఇదే తొలి మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. టోర్నిని విన్‌తో స్టార్ట్ చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అయితే మరి రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి? వారి బలాలు, బలహీనతలు ఏంటి? ఏ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది? ఈ విషయాలను ఇప్పుడు విశ్లేషిద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎక్కువగా ఫారెన్ ప్లేయర్లను కొనుగోలు చేసిందనే వాదన వినిపించింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురే ఫారెన్ ప్లేయర్లు ఆడే ఛాన్స్ ఉన్న సమయంలో జట్టు మొత్తం విదేశీ ఆటగాళ్లతో నింపేశారనే విమర్శలు వచ్చాయి. పైగా జట్టులో టీమిండియా స్టార్లు ఎవరు లేకపోవడం ఒక విధంగా మైనసే. మరి ఈ విమర్శల మధ్య అసలు జట్టు ఎలా ఉందో చూద్దాం. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్‌తో వావ్ అనిపించే ప్లేయర్లు చాలా మందే ఉన్నా.. వీరిలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండేవారు ఎవరో చెప్పడం కష్టంగా ఉంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉండొచ్చు. తర్వాత రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, ప్యాన్ కమిన్స్ బ్యాటింగ్‌కి రావొచ్చు. సమద్ బదులు నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆడించే ఛాన్స్ ఉంది. ఇక బౌలింగ్ విభాగం చూసుకుంటే.. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్‌కుమార్, ఉమ్రాన్ మాలిక్ పేస్ బౌలింగ్‌లో.. అలాగే వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ స్పిన్ బౌలింగ్‌తో మంచి స్ట్రాంగ్‌గానే ఉంది. అలాగే శ్రీలంక స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను ఆడించాలంటే.. మార్కరమ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టాల్సిందే. మొత్తంగా జట్టు స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. బలహీనతలు కూడా పెద్దగా ఏం కనిపించడం లేదు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్
టీమ్ చూసేందుకు సాధారణంగా ఉన్నా.. సంచలనాలు సృష్టించడంలో కేకేఆర్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ సారి వారి టీమ్‌ను పరిశీలిస్తే.. ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్, రహమనుల్లా గుర్బాజ్ రావొచ్చే. వన్‌డౌన్‌లో ఫిల్ సాల్ట్, లేదా నితీష్ రాణా.. తర్వాత శ్రేయస్ అయ్యర్, మనిష్ పాండే, రింకూ సింగ్‌తో బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆల్‌రౌండర్ల రూపంలో ఆండ్రూ రస్సెల్ ఉండనే ఉన్నాడు. బౌలింగ్‌లో కేకేఆర్ స్ట్రాంగ్‌గా ఉంది. 24.75 కోట్లు పెట్టి కొన్న మిచెల్ స్టార్క్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. అతనితో పాటు.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌తో స్పిన్ బౌలింగ్ కూడా అద్బుతంగా ఉంది. స్టార్క్‌కు చేతన్ సకారియా, హర్షిత్ రాణా పేస్‌లో తోడుగా ఉంటారు. పేపర్‌పై కేకేఆర్ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. మరి గ్రౌండ్‌లో ఎలా ఆడుతుందో చూడాలి. కెప్టెన్ అయ్యర్ ఫామ్‌లో లేకపోవడం కేకేఆర్ పెద్ద మైనస్.
ప్రిడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించే అవకాశం ఉంది.
ప్లేయింగ్ ఎలెవన్(అంచనా)
కేకేఆర్: రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
ఎస్‌ఆర్‌హెచ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, వనిందు హసరంగా, పాట్ కమిన్స్ (కెప్టెన్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.