SNP
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి పెద్ద జట్లతో పాటు ఆఫ్ఘనిస్థాన్ లాంటి పసికూన జట్టుపై ఘనవిజయంతో ప్రస్తుతం టాస్ ప్లేస్‌లో ఉంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ప్రదర్శనపై సగటు క్రికెట్ అభిమానులు సంతోషంగా ఉన్నా.. కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు చేయాల్సిన అవసరం ఉందంటూ.. ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. మరి ప్రస్తుతం టీమిండియా సాధించిన విజయాలతో పాటు, జట్టు చేయాల్సిన సర్దుబాట్లు, ఇబ్బంది పెడుతున్న అంశాలపై ఆయన అందించిన విశ్లేషణ చూద్దాం..
వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను పరిశీలస్తే.. టీమిండియా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోందని అన్నారు వెంకటేశ్. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా చేస్తున్నాడని, ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్స్ గెలిచిన అనుభవం రోహిత్‌కు ఉందని, అది అంతా ఈజీగా సాధ్యమైంది కాదని అతని కెప్టెన్సీ ఎబిలిటీ వల్లే ముంబై ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిందని అన్నారు. అయితే.. టీమ్‌లో శార్డుల్ ఠాకూర్ రోల్ ఏంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. రోహిత్ శర్మ ఎక్స్‌ట్రా బ్యాటర్ కింద.. షమీ, అశ్విన్‌ను పక్కనపెట్టి మరీ శార్దుల్ ఠాకూర్‌ను తీసుకుంటున్నా.. అతను అంతగా రాణించడం లేదని అన్నారు.
అయితే.. మ్యాచ్ ఎవరితో ఆడుతున్నాం, పిచ్ ఎలా ఉందనే విషయాలపై ఆధారపడి రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేస్తాడన, శార్డుల్ ఠాకూర్ స్థానంలో తర్వాతి మ్యాచ్‌ల్లో షమీ లేదా అశ్విన్ ఆడే ఛాన్స్ ఉందని అన్నారు. టీమిండియా ప్రస్తుతం ఆడుతున్న తీరు చూస్తుంటే అన్ని జట్ల కంటే స్ట్రాంగ్ టీమ్‌గా ఉందన్నారు. ఆస్ట్రేలియా టీమ్ కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతుందని, ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం తదితర సమస్యలతో ఆసీస్ సరైన ప్రదర్శన కనబర్చలేకపోతుందన్నారు. ప్రస్తుతం టీమిండియాకు.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టీమ్స్ నుంచి గట్టి పోటీ ఉంటుందని పేర్కొన్నారు. మరి ప్రస్తుత జరుగుతున్న వరల్డ్ కప్‌పై ఆయన అందించిన విశ్లేషణ కింద వీడియో రూపంలో ఉంది, చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్‌పై కోహ్లీకి అసూయ? పాక్‌తో మ్యాచే ఎగ్జాంపుల్!