Nidhan
Spain Cricket Team Creates World Record: ఒక పసికూన జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్లో టీమిండియా వల్ల కూడా కాని అరుదైన ఘనతను ఆ టీమ్ సాధించింది. ఇంతకీ ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Spain Cricket Team Creates World Record: ఒక పసికూన జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్లో టీమిండియా వల్ల కూడా కాని అరుదైన ఘనతను ఆ టీమ్ సాధించింది. ఇంతకీ ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Nidhan
ప్రస్తుత క్రికెట్లో టీమిండియా హవా నడుస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ మన జట్టు టాప్‌లో ఉంది. మన టీమ్ సాధించని రికార్డు లేదు. భారత్ బరిలోకి దిగితే రికార్డులు బ్రేక్ అవుతాయి. అంతగా మోడర్న్ క్రికెట్‌ను టీమిండియా డామినేట్ చేస్తోంది. అలాంటి భారత జట్టుకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను ఒక పసికూన జట్టు సొంతం చేసుకుంది. టీమిండియా అనే కాదు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి బడా టీమ్స్ వల్ల కాని ఓ అరుదైన ఫీట్‌ను ఆ చిన్న జట్టు సాధించింది. ఏకంగా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి ఔరా అనిపించింది. మరి.. ఆ టీమ్ ఏంటి? అది సాధించిన రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్పెయిన్ క్రికెట్ టీమ్ అద్భుతం చేసి చూపించింది. అందరూ తమ వైపు చూసేలా ఓ ఫీట్‌ను నమోదు చేసింది. టీ20 క్రికెట్లో వరుసగా 14 విజయాలు సాధించిన టీమ్‌గా స్పెయిన్ నిలిచింది. ఈ క్రమంలో 2022లో మలేసియా నమోదు చేసిన వరుసగా 13 విక్టరీలు రికార్డును బ్రేక్ చేసి సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పింది. యూరోప్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ క్వాలిఫయర్ సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో గ్రీస్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది స్పెయిన్. ఈ గెలుపుతో పొట్టి ఫార్మాట్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది స్పెయిన్. టీ20ల్లో ఆ జట్టు చివరగా ఓటమిని ఎదుర్కొని ఏడాదిన్నర దాటింది.
20 నెలల కింద ఓ టీ20లో ఓడిపోయింది స్పెయిన్. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన 15 టీ20 మ్యాచుల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుపై స్పెయిన్ హెడ్ కోచ్ కోరె రట్గర్స్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ రికార్డు తమకు స్ఫూర్తిని ఇస్తోందన్నాడు. అయితే రికార్డుల కోసం తాము ఆడమని స్పష్టం చేశాడు. ఈ రికార్డుకు క్రెడిట్ అంతా స్పెయిన్ ప్లేయర్లకే దక్కుతుందన్నాడు. కోచింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ను కూడా మెచ్చుకోవాల్సిందేనని చెప్పాడు కోరె. ఇక, గ్రీస్‌పై విజయం సాధించినా యూరోప్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ముందుకు వెళ్లలేకపోయింది స్పెయిన్. అయితే ఆ టీమ్ బ్రాంజ్ మెడల్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఫిన్లాండ్, గుర్న్సేల్లో ఓ టీమ్‌ను ఓడించాల్సి ఉంటుంది. మరి.. భారత్, ఆసీస్, ప్రొటీస్ లాంటి బిగ్ టీమ్స్ వల్ల కాని ఘనతను స్పెయిన్ అందుకోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
#Spain Break World Record For Most Consecutive #T20I Winshttps://t.co/tTIPLlI7nN
— News18 (@CNNnews18) August 26, 2024