iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికా విధ్వంసానికి కారణం అదేనా.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?

  • Author Soma Sekhar Published - 03:02 PM, Thu - 2 November 23

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో భీకరఫామ్ లో ఉన్న సౌతాఫ్రికాకు ఓ బలం ఉంది. ఇదేదో నేను చెప్పే మాట కాదు.. గణాంకాలు చెబుతున్న మాట. మరి ఇంతకీ సౌతాఫ్రికా భీకరఫామ్ కు కారణం ఏంటో? గణాంకాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో భీకరఫామ్ లో ఉన్న సౌతాఫ్రికాకు ఓ బలం ఉంది. ఇదేదో నేను చెప్పే మాట కాదు.. గణాంకాలు చెబుతున్న మాట. మరి ఇంతకీ సౌతాఫ్రికా భీకరఫామ్ కు కారణం ఏంటో? గణాంకాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 03:02 PM, Thu - 2 November 23
సౌతాఫ్రికా విధ్వంసానికి కారణం అదేనా.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?

ఓ జట్టు ఒక్క మ్యాచ్ లో విజయం సాధిస్తే.. ఏదో గాలివాటం అనుకోవచ్చు. ఇక రెండో మ్యాచ్ లో గెలిస్తే.. పర్లేదు బాగానే ఆడుతున్నారు అనుకుంటాం. అదే ఒక జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్ లో దాదాపు 300కు పైగా భారీ స్కోర్లు చేస్తూ.. విజయాలు సాధిస్తుంటే.. ఆ జట్టుకు ఏదో బలమైన బలం ఉండే ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో భీకరఫామ్ లో ఉన్న సౌతాఫ్రికాకు ఓ బలం ఉంది. ఇదేదో నేను చెప్పే మాట కాదు.. గణాంకాలు చెబుతున్న మాట. మరి ఇంతకీ సౌతాఫ్రికా భీకరఫామ్ కు కారణం ఏంటో? గణాంకాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికా.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియాతో పాటుగా సమానంగా వినిపిస్తున్న పేరు. ఈ మెగాటోర్నీలో 6 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో టీమిండియా వెనకాలే ఉంది. ఒక్క నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో తప్పిస్తే.. మిగతా అన్ని మ్యాచ్ ల్లో సఫారీ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వీరు సృష్టించిన విధ్వంసానికి స్కోర్ బోర్డులు బద్దలవుతూనే ఉన్నాయి. తాజాగా పూణే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సైతం 357 పరుగుల భారీ స్కోర్ చేసింది సౌతాఫ్రికా జట్టు. మంచినీళ్లు తాగినంత ఈజీగా 350+ స్కోర్లు సాధిస్తూ.. ప్రపంచ క్రికెట్ ను ఔరా అనిపిస్తోంది. ఇలా సఫారీ జట్టు దాదాపు ఆడిన ప్రతీ మ్యాచ్ లో 300కు పైగా రన్స్ చేయడానికి కారణం అద్భుతమైన బ్యాటర్లు ఉండటం, వారు అంతకంటే అద్భుతంగా రాణించడంతో పాటుగా.. వారు తొలుత బ్యాటింగ్ చేయడమే.

టాస్ సఫారీ టీమ్ గెలిచినా.. ప్రత్యర్థి జట్టు గెలిచినా.. తొలి బ్యాటింగ్ దక్షిణాఫ్రికాది అయితే ఆ మ్యాచ్ లో స్కోర్ బోర్డు 300 రన్స్ దాటడం ఖాయమే. దీనికి ఉదాహరణ గత 8 వన్డేలో సౌతాఫ్రికా చేసిన పరుగులే. ఈ 8 వన్డేల్లో తొలి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు వరుసగా.. 338/6, 416/5,315/9 ఆస్ట్రేలియాపై సాధించగా.. 428/5 శ్రీలంకపై, 311/7 ఆసీస్ పై, 399/7 ఇంగ్లాండ్ పై, 382/5 బంగ్లాపై, తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 357/4 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అదీకాక ఈ 8 మ్యాచ్ ల్లో 5 సార్లు 350+ స్కోర్లు చేయడం గమనార్హం. పిచ్ ను ఉపయోగించుకుంటూ.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న సఫారీ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపుతున్నారు. వారి విజయాలతో పాటుగా ఇంతలా భారీ స్కోర్లు చేయడానికి ప్రధాన కారణం+బలం తొలుత బ్యాటింగ్ చేయడమే అని క్రీడా పండితులు చెప్పుకొస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసానికి న్యూజిలాండ్ ముందు 358 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. డికాక్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ.. మరో శతకంతో మెరిశాడు. 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. అతడికి తోడు డస్సెన్ 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్ లతో 133 రన్స్ తో చెలరేగారు. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 67 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.