iDreamPost

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్?

వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ ప్లేయర్ ఎవరంటే?

వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ ప్లేయర్ ఎవరంటే?

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్?

టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ఇదే మంచి సమయం అని భావించిన టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. కోహ్లీ యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇంతకంటే మంచి సమయం రాదని భావించి గుడ్ బై చెప్పానని రోహిత్ పేర్కొన్నాడు. తాాజాగా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో 7 రన్స్ తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది దక్షిణాఫ్రికా. ఇక ఈ ఓటమి బాధను జీర్ణించుకోలేని ఆ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు న్యూస్ వైరల్ గా మారింది. ఫైనల్ మ్యాచ్ లో 21 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు చేరాడు మిల్లర్. దాంతో జట్టు ఓటమికి తాను కూడా ఓ కారణమని భావించిన మిల్లర్ పొట్టి ఫార్మాట్ కు దూరమైనట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాకు తొలి వరల్డ్ కప్ ను అందించడంలో విఫలం కావడంతో.. ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట మిల్లర్. అయితే ఈ వార్తలపై అటు మిల్లర్ కానీ.. సౌతాఫ్రికా టీమ్ కానీ ఇంకా స్పందించలేదు.

డేవిడ్ మిల్లర్ టీ20 కెరీర్ విషయానికి వస్తే.. 125 టీ20ల్లో 2439 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో విధ్వంసకర ప్లేయర్ గా పేరుగాంచాడు మిల్లర్. అందుకే అభిమానులు ముద్దుగా ‘మిల్లర్ కిల్లర్’ అని పిలుచుకుంటారు. కాగా.. ఈ వరల్డ్ కప్ లోనే చాలా మంది దిగ్గజ ప్లేయర్లు టీ20లకు వీడ్కోలు పలికారు. ట్రెంట్ బౌల్ట్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా తాజాగా డేవిడ్ మిల్లర్ వచ్చి చేరతాడు అనుకున్నారు. కానీ, డేవిడ్ మిల్లర్ మాత్రం ఇలాంటి వార్తలు వైరల్ అయిన తర్వాత తాను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అవాస్తవం అని చెప్పాడు. తాను ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటన చేయలేదు అంటూ ప్రకటించాడు.

 

View this post on Instagram

 

A post shared by Just Lol Things (@just.lol.things)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి