iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఇది గమనించారా? రోహిత్ ను ట్రాప్ చేసి, ఔట్ చేసిన రబాడ! వీడియో వైరల్..

  • Published Dec 27, 2023 | 8:19 AM Updated Updated Dec 27, 2023 | 8:25 AM

ఈ విషయాన్ని మీరు గమనించారా? తొలి టెస్ట్ లో సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ ట్రాప్ చేసి మరీ రోహిత్ శర్మను పెవిలియన్ కు పంపి టీమిండియాకు తొలి వికెట్ రూపంలో భారీ షాక్ ఇచ్చాడు.

ఈ విషయాన్ని మీరు గమనించారా? తొలి టెస్ట్ లో సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ ట్రాప్ చేసి మరీ రోహిత్ శర్మను పెవిలియన్ కు పంపి టీమిండియాకు తొలి వికెట్ రూపంలో భారీ షాక్ ఇచ్చాడు.

Rohit Sharma: ఇది గమనించారా? రోహిత్ ను ట్రాప్ చేసి, ఔట్ చేసిన రబాడ! వీడియో వైరల్..

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి.. పెవిలియన్ చేరాడు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత తొలిసారి గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన రోహిత్ విఫలం అయ్యాడు. అయితే సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ ట్రాప్ చేసి మరీ రోహిత్ ను పెవిలియన్ కు పంపి టీమిండియాకు తొలి వికెట్ రూపంలో భారీ షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని మీరు గమనించారా? అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలిరోజు ఆతిథ్య సౌతాఫ్రికా పైచేయి సాధించింది. సఫారీ బౌలర్లు విజృంభించడంతో.. పరుగులు చేయడం అటుంచి.. వికెట్ కాపాడుకోవడానికే నానా తంటాలు పడ్డారు. మరీ ముఖ్యంగా ప్రోటీస్ స్టార్ బౌలర్ రబాడ భారత బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రబాడ పక్కా ప్లాన్ వేసి మరీ ఔట్ చేశాడు. అసలేం జరిగిందంటే? రోహిత్ శర్మ బలహీనతను గుర్తించిన రబాడ ఫైన్ లెగ్ లో ఫీల్డర్ ను పెట్టాడు. అందుకు తగ్గట్లుగానే షార్ట్ బాల్ ను సంధించాడు. దీంతో భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్.. ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న నండ్రే బర్గర్ కు సింపుల్ క్యాచ్ ఇచ్చి.. నిరాశగా పెవిలియన్ చేరాడు.

rohit in rabaada trap

కాగా.. హిట్ మ్యాన్ వీక్ నెస్ ను గుర్తించి సరిగ్గా అక్కడే ఫీల్డర్ ను పెట్టి షార్ట్ బాల్ ను సంధించి.. విజయవంతం అయ్యాడు రబాడ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. రబాడ రోహిత్ ను అవుడ్ చేయడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. క్రీజ్ లో కేఎల్ రాహుల్(70), సిరాజ్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కగిసో రబాడ 5 వికెట్లతో భారత జట్టు పతనాన్ని శాసించాడు. మరి రోహిత్ ను రబాడ ట్రాప్ చేసి అవుట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.