iDreamPost
android-app
ios-app

Rohit-Kohli: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! జై షా కీలక ప్రకటన..

  • Published Jul 01, 2024 | 10:25 AM Updated Updated Jul 01, 2024 | 10:25 AM

టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో.. ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ఆ శుభవార్త ఏంటంటే?

టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో.. ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ఆ శుభవార్త ఏంటంటే?

Rohit-Kohli: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! జై షా కీలక ప్రకటన..

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. తమ వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని భావించిన స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. మరికొన్ని రోజులు పొట్టి క్రికెట్ లో తమను అలరిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ అనూహ్య నిర్ణయానికి వారు షాకైయ్యారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా కోహ్లీ, రోహిత్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ న్యూస్ తో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. అదీగాక పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో.. మిగిలిన వన్డే, టెస్ట్ ఫార్మాట్స్ కూడా త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అన్న సందేహం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ విరాట్, రోహిత్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పాడు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లకు  సీనియర్ ఆటగాళ్లు జట్టులోనే ఉంటారని హింట్ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ కు కాస్త ఊరట లభించింది.

Good news for Rohit and Kohli fans!

అయితే.. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వస్తే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై వేటు తప్పదు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జై షా ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పాటుగా ఈ రెండు టైటిల్స్ కూడా ఇండియా గెలుచుకోవాలని ఆకాంక్షించాడు. అయితే కొత్త కోచ్ వస్తే.. జట్టులో పరిస్థితులు ఎలా ఉంటాయో అంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ వార్త కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 125 కోట్ల ప్రైజ్ మనీని టీమిండియాకు ఇవ్వనుంది.