iDreamPost

రిజర్వ్‌ డే లేని ఇండియా vs ఇంగ్లండ్‌ సెమీస్‌ రద్దు అయితే.. ఫైనల్‌కి వెళ్లేది ఎవరు?

  • Published Jun 27, 2024 | 8:20 AMUpdated Jun 27, 2024 | 8:20 AM

India vs England, Semi Final, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ తొలి సెమీస్‌లో ఆఫ్ఘాన్‌పై సౌతాఫ్రికా గెలిచి ఫైనల్‌కు వెళ్లింది. ఒక రెండో సెమీస్‌లో ఇండియా, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారు? సౌతాఫ్రికాతో ఎవరు పోటీ పడతారో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్‌ మ్యాచ్‌ ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా గురువారం రాత్రి గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. టీ20 వరల్డ్ కప్‌ 2022 సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి.. ఈ వరల్డ్‌ కప్‌ అదే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్ష గండం ఉందని వెదర్‌ రిపోర్ట్‌ చెబుతోంది. గయానాలో రేపు 88 శాతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు ఆక్యూవెదర్‌ పేర్కొంది. ఈ వార్తతో ఒక వేళ వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు అయితే.. ఫైనల్‌కు ఎవరు వెళ్తారనే విషయంపై క్రికెట్‌ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఎందుకంటే.. ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు రిజ్వర్‌ డే కూడా లేదు. సౌతాఫ్రికా వర్సెస్‌ ఆఫ్ఘనిస్థాన్‌ సెమీ ఫైనల్‌ 1కు రిజర్వ్‌ డే కేటాయించిన ఐసీసీ.. రెండో సెమీస్‌కు మాత్రం రిజర్వ్‌ డే కేటాయించలేదు. 29వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ ఉండటంతో.. రెండో సెమీస్‌కు రిజర్వ్ డే కేటాయిస్తే.. ఫైనల్‌కి దానికి మధ్య కనీసం 24 గంటల సమయం కూడా ఉండదు. అందుకే రెండో సెమీస్‌కు రిజర్వ్‌ డే ఇవ్వలేదు. అయితే మరి వర్షం కారణంగా గురువారం జరగాల్సిన సెమీస్‌ మ్యాచ్‌ రద్దు అయితే.. ఇండియానే ఫైనల్‌కు వెళ్లనుంది. సూపర్‌ 8 స్టేజ్‌లో గ్రూప్‌ 1లో ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా జట్లను ఓడించి.. టీమిండియా టేబుల్‌ టాపర్‌గా నిలిచింది.

అందుకే వర్షం కారణంగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు అయితే.. ఫైనల్‌కు ఇండియా, ఇంటికి ఇంగ్లండ్‌ వెళ్లనున్నాయి. రిజర్వ్‌డే కేటాయించకపోయినా.. మ్యాచ్‌ సమయం తర్వాత 250 నిమిషాలు అదనంగా కేటాయించారు. సో వర్షం 7 గంటల పాటు నాన్‌స్టాప్‌గా కురుస్తే ఇండియా ఫైనల్‌కు వెళ్తుంది. ఇక సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగే తొలి సెమీ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలించి.. మ్యాచ్‌ రద్దు అయితే.. ఆ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించారు. ఒక వేళ రిజర్వ్‌ డే రోజు కూడా వర్షం పడితే.. సూపర్‌ 8లో గ్రూప్‌ 2 నుంచి టేబుల్‌ టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్తుంది. అద్భుత పోరాటంతో తొలి సారి సెమీ ఫైనల్‌ వరకు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్‌ సెమీస్‌ ఆడకుండానే ఇంటికి వెళ్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి