iDreamPost
android-app
ios-app

గంగూలీ ఫోన్ దొంగలించిన దొంగలు.. దాని విలువ ఎంతంటే?

  • Published Feb 11, 2024 | 11:56 AM Updated Updated Feb 11, 2024 | 11:56 AM

Sourav Ganguly Phone Stolen: టీమిండియా మాజీ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భారీ షాకిచ్చారు దొంగలు.

Sourav Ganguly Phone Stolen: టీమిండియా మాజీ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భారీ షాకిచ్చారు దొంగలు.

  • Published Feb 11, 2024 | 11:56 AMUpdated Feb 11, 2024 | 11:56 AM
గంగూలీ ఫోన్ దొంగలించిన దొంగలు.. దాని విలువ ఎంతంటే?

టీమిండియా మాజీ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భారీ షాకిచ్చారు దొంగలు. దాదా సెల్ ఫోన్ ను చోరీ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో కలకత్తాలోని ఠాకూర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసు కేసు నమోదు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఫోన్ ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం ఉందని, బ్యాంకు ఖాతాలకు ఈ ఫోన్ నెంబరే యాక్సెస్ ఉందని, త్వరగా రికవరీ చేయానలి దాదా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫోన్ విలువ ఎంతో తెలుసా? పూర్తి వివరాల్లోకి వెళితే..

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి షాకిచ్చారు దొంగలు. అతడి ఫోన్ దొంగిలించబడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయం 11:30 గంటలకు చివరిసారిగా తన ఫోన్ ను చూసినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఎంతవెతికినా మెుబైల్ కనిపించలేదని చెప్పుకొచ్చాడు. తన ఫోన్ దొంగిలించబడిన సమయంలో ఇంట్లో పెయింటింగ్ పనులు జరుగుతున్నాయని దాదా తెలిపాడు. దీంతో పోలీసులు వర్కర్లను ప్రశించే పనిలో పడ్డారు. ఇక ఆ ఫోన్ విలువ రూ. 1.6 లక్షలు ఉంటుందని తెలిపాడు. అందులో విలువైన సమాచారం ఉందని, బ్యాంకు కు సంబంధించిన వివరాలు ఉన్నాయని వాటిని బయటకి రాకుండా చూడాలని పోలీసులకు కోరాడు. వీలైనంత త్వరగా ఫోన్ రికవరీ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరి గంగూలీనే బురిడీ కొట్టించి ఫోన్ ఎత్తుకెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: SA20 2024: వీడియో: రెండోసారి ఛాంపియన్స్​గా సన్​రైజర్స్.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet