iDreamPost
android-app
ios-app

హార్ధిక్‌ పాండ్యా విషయంలో వాళ్లు చేసింది కరెక్ట్‌ కాదు: దాదా

  • Published Apr 06, 2024 | 5:33 PM Updated Updated Apr 06, 2024 | 5:36 PM

Sourav Ganguly, Hardik Pandya: ఐపీఎల్‌లో హార్ధిక్‌ పాండ్యాపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ. ఈ క్రమంలోనే పాండ్యా గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Sourav Ganguly, Hardik Pandya: ఐపీఎల్‌లో హార్ధిక్‌ పాండ్యాపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ. ఈ క్రమంలోనే పాండ్యా గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 06, 2024 | 5:33 PMUpdated Apr 06, 2024 | 5:36 PM
హార్ధిక్‌ పాండ్యా విషయంలో వాళ్లు చేసింది కరెక్ట్‌ కాదు: దాదా

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడని అతనిపై రోహిత్‌ ఫ్యాన్స్‌ కోపంగా ఉన్నారు. ఐపీఎల్‌ ఆరంభానికి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి తిరిగొచ్చిన పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ముంబై మేనేజ్‌మెంట్‌. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ లాంటి కెప్టెన్‌ను తప్పించి అతని స్థానంలో పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ కూడా ఆగ్రహంగానే ఉన్నారు. పైగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్న పాండ్యా, రోహిత్‌ శర్మను బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కి పంపడంతో రోహిత్‌ ఫ్యాన్స్‌ పాండ్యాపై మరింత రెచ్చిపోయారు.

పాండ్యా కనిపించినా, అతని పేరు వినిపించినా స్టేడియం మొత్తం బో అంటూ మారుమోగిపోతుంది. గతంలో మరే భారత క్రికెటర్‌ కూడా ఇంతలా ప్రేక్షకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొలేదు. ఇదే కాక సోషల్‌ మీడియాలో కూడా పాండ్యాపై దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. ఈ విషయంపై టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌కు డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్‌ గంగూలీ స్పందిస్తూ.. పాండ్యాకు సపోర్ట్‌గా మాట్లాడాడు. ‘ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్‌గా నియమించింది. దేశానికో, రాష్ట్రానికో కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్పోర్ట్స్‌లో జరిగేది ఇదే.. రోహిత్ శర్మ క్లాస్ వేరే. ఫ్రాంచైజీకి, ఇండియాకి కెప్టెన్‌గా ఆటగాడిగా అతని ప్రదర్శన వేరే స్థాయిలో ఉంది. హార్దిక్‌ని కెప్టెన్‌గా నియమించడంలో ఎలాంటి తప్పు లేదు.’ అంటూ దాదా పేర్కొన్నాడు.

What they did in the case of Hardik Pandya was not correct 2

అయితే.. పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ వరసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం కూడా పాండ్యాకు మైనస్‌గా మారింది. ఈ వరుస ఓటములతో మళ్లీ తిరిగి రోహిత్‌ శర్మను కెప్టెన్‌ను చేయాలనే డిమాండ్‌ కూడా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో దాదా పాండ్యాకు మద్దతుగా నిలవడం విశేషం. ఎందుకంటే.. విరాట్‌ కోహ్లీని తప్పించి.. రోహిత్‌ను టీమిండియా కెప్టెన్‌గా చేసిందే గంగూలీ. కానీ ఇప్పుడు మాత్రం రోహిత్‌ను తప్పించి పాండ్యాను కెప్టెన్‌ చేయడాన్ని దాదా సమర్ధిస్తున్నాడు. అది ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయం అని, అందులో పాండ్యా తప్పేమి లేదంటూ.. అతనిపై వస్తున్న విమర్శలను తగ్గించే ప్రయత్నం చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.