SNP
ఐపీఎల్ వేలంలో ఓ అనామక ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా రూ.7.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతనే కుమార్ కుశాగ్రా.. ఇతని కొనుగోలు వెనుక సౌరవ్ గంగూలీ ఉన్నాడు. ఇంతకీ ఈ కుమార్ కుశాగ్రా స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ వేలంలో ఓ అనామక ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా రూ.7.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతనే కుమార్ కుశాగ్రా.. ఇతని కొనుగోలు వెనుక సౌరవ్ గంగూలీ ఉన్నాడు. ఇంతకీ ఈ కుమార్ కుశాగ్రా స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కొంతమంది ఆటగాళ్లకు ఊహించని ధర లభించింది. స్టార్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, అల్జారీ జోసెఫ్‌లకు కలలో కూడా ఊహించని ధర వచ్చింది. వీరితో పాటు అనామక ప్లేయర్లు సమిర్ రిజ్వీ, కుమార్ కుశాగ్రాలకు కూడా వాళ్ల జీవితాలు మారిపోయే ధర పలికారు. ముఖ్యంగా కుమార్ కుశాగ్రా గురించి మాట్లాడుకుంటే.. 19 ఏళ్ల కుర్రాడి కోసం చెన్నై, గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. అంతిమంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ.7.20 కోట్లు పెట్టి కుమార్‌ను తమ టీమ్‌లోకి తీసుకుంది. ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు ఢిల్లీ ఇంత ధర ఎందుకు పెట్టిందా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ఆ కుర్రాడి కొనుగోలు వెనుక గంగూలీ హస్తం ఉంది.
దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న కుమార్‌ను చూసిన గంగూలీ ఎలాగైన ఢిల్లీ టీమ్‌లోకి తీసుకుంటానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఫ్రాంచేజ్‌లు పోటీకి వచ్చినా.. వెనుకడుగు వేయకుండా కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి తీసుకొచ్చాడు. కుమార్ కీపింగ్ స్కిల్స్‌ను మెచ్చిన దాదా.. అతనిలో ధోనిలో ఉన్న టాలెంట్ ఉందని, అందుకు అతని కోసం రూ.10 కోట్ల వరకు అయినా వెళ్లేందుకు కూడా ఢిల్లీ సిద్ధపడినట్లు తెలుస్తుంది. పైగా.. ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పూర్తి స్థాయిలో కోలుకోకుంటే.. అతని స్థానంలో కుమార్‌ను వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దింపనుంది. అందుకోసమే.. బ్యాటింగ్ చేస్తూ.. ఓ మంచి వికెట్ కీపర్‌ను పట్టే క్రమంలో దాదాకు మరో ధోని దొరికేశాడు.
కుమార్ కుశాగ్రా దేశవాళీ క్రికెట్‌లో భాగంగా.. ఈ ఏడాది జరిగిన దేవధర్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో 109.13 స్ట్రైక్ రేట్‌తో 227 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో తన ఉనికిని చాటుకున్నాడు, మహారాష్ట్రపై 355 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 37 బంతుల్లో 67 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన కుమార్ 2020లో భారత అండర్-19 ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2022లో రంజీ ట్రోఫీ ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లో నాగాలాండ్‌పై డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 17 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్‌లో 250 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా కుమార్ నిలిచాడు. మరి కుమార్‌లో ఓ ధోనిని చూసిన గంగూలీ.. అతనికి రూ.7.20 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kumar Kushagra’s father said, “Sourav Ganguly was impressed with Kushagra after the trials and told him that DC will even bid 10cr for him. His keeping skills also impressed Ganguly and even told him that there’s a bit of MS Dhoni in him”. (Indian Express). pic.twitter.com/cg8DA0wKnV
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 20, 2023