iDreamPost
android-app
ios-app

20 ఏళ్ల క్రితం సౌరవ్ గంగూలీ.. ఇప్పుడు కోహ్లీ-అయ్యర్!

  • Author Soma Sekhar Published - 07:28 PM, Wed - 15 November 23

20 ఏళ్ల క్రితం దిగ్గజం సౌరవ్ గంగూలీ సాధించిన ఘనతను తాజాగా సాధించారు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. మరి 20 సంవత్సరాల క్రితం దాదా సాధించింది ఏంటి? ఆ రికార్డు వివరాల్లోకి వెళితే..

20 ఏళ్ల క్రితం దిగ్గజం సౌరవ్ గంగూలీ సాధించిన ఘనతను తాజాగా సాధించారు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. మరి 20 సంవత్సరాల క్రితం దాదా సాధించింది ఏంటి? ఆ రికార్డు వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 07:28 PM, Wed - 15 November 23
20 ఏళ్ల క్రితం సౌరవ్ గంగూలీ.. ఇప్పుడు కోహ్లీ-అయ్యర్!

వన్డే ప్రపంచ కప్ 2023ని టీమిండియా పూర్తిగా డామినేట్ చేసింది. గ్రూప్ దశలో జరిగిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి.. సెమీస్ లోకి అడుగుపెట్టిన భారత టీమ్ అందుకు తగ్గట్లుగానే సెమీస్ లో రెచ్చిపోయింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. అయితే 20 ఏళ్ల క్రితం దిగ్గజం సౌరవ్ గంగూలీ సాధించిన ఘనతను తాజాగా సాధించారు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. మరి 20 సంవత్సరాల క్రితం దాదా సాధించింది ఏంటి? ఆ రికార్డుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 397 పరుగులు చేసింది. జట్టులో బ్యాటింగ్ కు వచ్చిన అందరు ఆటగాళ్లు తమ బ్యాట్లకు పని చెప్పారు. రోహిత్ శర్మ(47), గిల్(80), కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105), కేఎల్ రాహుల్(39*) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో సెంచరీ చేసిన రెండో టీమిండియా బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధించాడు.

ఇంతకు ముందు ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడిగా టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ మాత్రమే. 2003 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో దాదా కెన్యా జట్టుపై సెంచరీ(111) బాదాడు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ ను సాధించారు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు. గడిచిన 20 సంవత్సరాల్లో ఏ క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీలు సాధించడం ద్వారా పలు రికార్డులు బద్దలు కొట్టారు వీరిద్దరు. మరి దాదా సాధించిన రికార్డును ఇన్నేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.