Rohit Sharma: అలా జరిగితే రోహిత్ శర్మ సముద్రంలో దూకేస్తాడు! గంగూలీ షాకింగ్ కామెంట్స్..

Rohit Sharma: అలా జరిగితే రోహిత్ శర్మ సముద్రంలో దూకేస్తాడు! గంగూలీ షాకింగ్ కామెంట్స్..

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్ రోహిత్ శర్మపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్ రోహిత్ శర్మపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలోకి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీమిండియా. అందుకు తగ్గట్లుగానే ఆరంభం నుంచి అదరగొట్టింది. లీగ్ దశలో, సూపర్ 8లో స్థాయి తగ్గ ప్రదర్శన ఇచ్చి.. ఫైనల్లోకి దూసుకొచ్చింది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా ఎరగని టీమ్ గా భారత్ నిలిచింది. మరోవైపు సౌతాఫ్రికా సైతం ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకుంది. బలాబలాలు చూసుకుంటే.. ఇరు జట్లు కూడా సమవుజ్జీలే. దాంతో ఈ ఆసక్తికర పోరు కోసం ఫ్యాన్స్ తో పాటుగా దిగ్గజ క్రికెటర్లు కూడ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలా జరిగితే కెప్టెన్ రోహిత్ శర్మ సముద్రంలో దూకేస్తాడని చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్, క్రీడా దిగ్గజాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ గెలుచుకుని తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. అటు సౌతాఫ్రికా తొలి వరల్డ్ కప్ ను ముద్దాడాలని చూస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కు ముందు భారత దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోతే.. బార్బడోస్ సముద్రంలో దూకేయాలన్న ఆలోచన రోహిత్ శర్మకు వస్తుందని దాదా చెప్పుకొచ్చాడు.

గంగూలీ మాట్లాడుతూ..”టీమిండియాను రోహిత్ శర్మ ముందుండి గొప్పగా నడిపిస్తున్నాడు. పైగా ఫామ్ లోకి వచ్చాడు. ఫైనల్లో కూడా ఇదే జోరును చూపిస్తాడని అనుకుంటున్నాను. అయితే ఆరు నెలల గ్యాప్ లో రెండు వరల్డ్ కప్ ఫైనల్స్ లో రోహిత్ ఓడిపోతాడని నేను భావించట్లేదు. కానీ ఒకవేళ టీమిండియా ఓడిపోతే.. రోహిత్ బార్బడోస్ సముద్రంలో దూకేస్తాడు. ఈ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందని భావిస్తున్నాను. అయితే ఆటగాళ్లు అద్భుతంగా రాణించడమే కాదు.. జట్టుకు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే వరల్డ్ కప్ గెలవగలరు” అంటూ దాదా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి రోహిత్ పై గంగూలీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments