SNP
Sourav Ganguly, MS Dhoni: ఈ సీజన్‌లో తొలి సారి ధోని బ్యాటింగ్‌కు దిగడంతో అంతా సంతోష పడుతున్నారు. కానీ సౌరవ్ గంగూలీ మాత్రం ధోనిని బ్యాటింగ్‌కి వస్తున్న సమయంలో ఏవో సిగ్నల్స్ పంపాడు. అవేంటో? ఎందుకు పంపాడో ఇప్పుడు చూద్దాం..
Sourav Ganguly, MS Dhoni: ఈ సీజన్‌లో తొలి సారి ధోని బ్యాటింగ్‌కు దిగడంతో అంతా సంతోష పడుతున్నారు. కానీ సౌరవ్ గంగూలీ మాత్రం ధోనిని బ్యాటింగ్‌కి వస్తున్న సమయంలో ఏవో సిగ్నల్స్ పంపాడు. అవేంటో? ఎందుకు పంపాడో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో జరగబోయే విధ్వంసాన్ని ఊహించిన టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ.. తన టీమ్ సభ్యులకు ఏ సిగ్నల్స్ పంపాడు. అయినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జాగ్రత్త పడకపోవడంతో దాదా ఊహించిన విధ్వంస జరిపోయింది. అయితే.. దాదా ఎవరి గురించి భయపడి ముందే డీసీని హెచ్చరించాడో తెలుసా.. తన కెప్టెన్సీలోనే స్టార్‌గా ఎదిగిన మహేంద్ర సింగ్ ధోని గురించి. అసలు ధోని గురించి దాదా ఏం సిగ్నల్ పంపాడు? ఎందుకు పంపాడో ఇప్పుడు చూద్దాం..
విశాఖపట్నం వేదికగా ఆదివారం సీఎస్‌కే వర్సెస్ డీసీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 16.1 ఓవర్లలో 120 పరుగుల వద్ద సీఎస్‌కే 6వ వికెట్ కోల్పోయిన దశలో ధోని బ్యాటింగ్‌కి వచ్చాడు. ఈ సీజన్‌లో ధోని బ్యాటింగ్‌కు రావడం ఇదే తొలి సారి. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ధోని బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో క్రికెట్ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తూ.. ఢిల్లీతో మ్యాచ్‌తో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే.. ధోని బ్యాటింగ్‌కి వస్తున్న క్రమంలో ఢిల్లీ డగౌట్‌లో ఉన్న సౌరవ్ గంగూలీ.. తన టీమ్ సభ్యులకు ఏవో సిగ్నల్స్ పంపాడు. ఈ సీన్స్‌ను లైవ్ మ్యాచ్‌లో చూపించలేదు.
ఎవరో తీసిన వీడియోలో ఈ దృష్ట్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే.. ధోని ఎంట్రీ సమయంలో అతనికి ఈ పిచ్ ఎంత బాగా కలిసొచ్చిందో.. గతంలో ఇదే గ్రౌండ్‌లో ధోని సృష్టించిన విధ్వంసం గురించి బాగా తెలిసిన దాదా.. ధోని బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో ఎలాంటి ప్లాన్ అమలు చేయాలో సిగ్నల్స్ పంపాడు. కానీ, దాదా హెచ్చరించినా డీసీ ప్లేయర్లు ధోని ముందు తేలిపోయారు. 16 బంతుల్లో 37 రన్స్ చేసి ధోని మ్యాచ్ గెలిపించేంత పనిచేశాడు. కానీ, ఢిల్లీనే మ్యాచ్ గెలవడంతో దాదా ఊపరిపీల్చుకున్నాడు. అయితే.. 2005లో ఇదే విశాఖపట్నం గ్రౌండ్‌లో గంగూలీ కెప్టెన్సీలోనే ధోని వన్‌డౌన్‌లో వచ్చి పాకిస్థాన్‌పై 145 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టైమ్‌లో లోయర్ ఆర్డర్‌లో ఆడుతున్న ధోనిని వన్‌డౌన్‌కి ప్రమోట్ చేసి, ఆడించింది దాదానే. అందుకే ధోని బలం ఏంటో బాగా తెలిసి.. తన టీమ్‌కు ముందు సిగ్నల్స్ పంపాడు. మరి నిన్నటి మ్యాచ్‌లో జరిగిన ఈ సీన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.