iDreamPost
android-app
ios-app

లక్ష్మణ్ లైఫ్‌లో అసలు విలన్ గంగూలీ అని మీకు తెలుసా? దారుణమైన మోసం!

  • Published Aug 19, 2024 | 6:23 PM Updated Updated Aug 19, 2024 | 6:23 PM

Sourav Ganguly, VVS Laxman, ID's Cricket Special: టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, మన హైదరాబాదీ లెజెండ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌ కెరీర్‌లో.. అసలు విలన్‌ సౌరవ్‌ గంగూలీ అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. కానీ, ఇది చదవితే.. ఒప్పుకుంటారు..

Sourav Ganguly, VVS Laxman, ID's Cricket Special: టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, మన హైదరాబాదీ లెజెండ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌ కెరీర్‌లో.. అసలు విలన్‌ సౌరవ్‌ గంగూలీ అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. కానీ, ఇది చదవితే.. ఒప్పుకుంటారు..

  • Published Aug 19, 2024 | 6:23 PMUpdated Aug 19, 2024 | 6:23 PM
లక్ష్మణ్ లైఫ్‌లో అసలు విలన్ గంగూలీ అని మీకు తెలుసా? దారుణమైన మోసం!

వీవీఎస్‌ లక్ష్మణ్‌.. ఇండియన్ క్రికెట్ లో పరిచయం అవసరం లేని పేరు. తెలుగు వారి ఖ్యాతిని నిలబెట్టిన అరుదైన క్రికెటర్. టెస్ట్ క్రికెట్ లో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు దక్కించుకున్న స్టార్ బ్యాటర్. అందరినీ వణికించిన ఆస్ట్రేలియాని కంగారు పెట్టించిన ఘనుడు. 2001లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్‌ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. అసలు టెస్టు క్రికెట్‌లో ఫాలో అన్‌ ఆడి గెలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే.. అలాంటి ఒక గొప్ప చరిత్రను టీమిండియా పేరిట లిఖించింది మాత్రం మన లక్ష్మణే. కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న టైమ్‌లో లక్ష్మణ్‌ను అప్పటికే టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ దారుణంగా దెబ్బేశాడు. ఇండియన్‌ క్రికెట్‌కు ఎంతో చేసిన గంగూలీ.. లక్ష్మన్‌ చిరకాల కోరికపై కలగానే మిగిల్చాడు. ఇంతకీ గంగూలీ.. లక్ష్మణ్‌కు చేసిన అన్యాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1996 నవంబర్‌ 20న సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్‌ షార్ట్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ వెంటనే 1998 ఏప్రిల్‌ 09న వన్డే జట్టలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ.., మొదటి మూడేళ్ళ కాలంలో లక్ష్మణ్ టెక్నీక్ ఉన్న బ్యాటర్ గా గుర్తింపు పొందాడే తప్ప.. ఎక్కడా మెరుపులు మెరిపించింది లేదు. అయితే.. 2001 కల్లా తన కెరీర్‌ పీక్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే కోల్‌కత్తాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో తన విశ్వరూపం చూపించాడు. ఆ మ్యాచ్‌తో పాటు లక్ష్మణ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 171 పరుగులకే ఆలౌట్‌ అయి ఫాలో ఆన్‌ ఆడాల్సి వచ్చింది.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కనీసం డ్రా చేసుకుంటుందన్న ఆశ కూడా ఎవరీ లేదు. ఆస్ట్రేలియా బౌలింగ్ ని ఎదుర్కోవడం ఇక అసాధ్యం అని.. దేశం అంతా టీవీలు కట్టేసిన క్షణాలు అవి.

Ganguly as a villain to VVS laxman

ఇలాంటి పరిస్థితుల్లో వీవీఎస్‌ లక్ష్మణ్‌.. ఆసీస్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి 376 పరుగులు భారీ భాగస్వామ్య నెలకొల్పి టీమిండియాను గెలిపించాడు. ఒక జట్టు ఫాలో ఆడి గెలిచిన చరిత్ర అంతకు ముందు లేదు. 281 పరుగులతో లక్ష్మణ్‌ చేసిన పోరాటం భారత్‌ను చరిత్ర సృష్టించేలా చేసింది. ఈ విజయంతో ప్రపంచ క్రికెట్‌లో లక్ష్మణ్‌ పేరు మారుమోగిపోయింది. ఎప్పుడో 1983లో టీమిండియాను ఓ రేంజ్‌లో చూసిన క్రికెట్‌ అభిమానులు మళ్లీ.. 2001లో టీమిండియా అంటే ఇదా అనేలా చేసింది ఆ గెలుపు. ఇక్కడి నుంచి టీమిండియా దశదిశా మారిపోయింది. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవాకు లక్ష్మణ్‌ మిగిల్చిన పీడకల అది.

అప్పటి నుంచి లక్ష్మన్‌ టెస్టు జట్టుతో పాటు వన్డే జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1998 నుంచి వన్డే జట్టులో ఉన్న లక్ష్మణ్‌కు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. అదే వన్డే వరల్డ్‌ కప్‌ ఆడటం. 2002లో సూపర్‌ ఫామ్‌లో ఉండటం. ప్రపంచంలోనే బెస్ట్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఉన్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్లపై పరుగుల వరదపారిస్తూ.. సెంచరీలు చేయడంతో 2003 వన్డే వరల్డ్‌ కప్‌లో తన చోటు ఖాయం అనుకున్నాడు. కానీ.. అప్పటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మాత్రం వేరేలా ఆలోచించాడు. కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న లక్ష్మణ్‌ను కాదని.. దినేష్‌ మోంగియాను వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకున్నాడు. లక్ష్మణ్‌ స్థానంలో ఎంపికైన దినేష్‌ మోంగియా మంచి ఆల్‌రౌండరే అయినా.. అతని కెరీర్‌లో చేసిన ఏకైక సెంచరీ అతన్ని వరల్డ్‌ కప్‌ జట్టులోకి తీసుకొచ్చింది. ఆ సెంచరీ కూడా వరల్డ్ కప్ కి కొన్ని నెలల ముందే చేశాడు మోంగియా. దీంతో.. గంగూలీ అక్కడ లెక్క తప్పి లక్ష్మణ్ కి అన్యాయం చేసేశాడు.

Ganguly as a villain to VVS laxman

నిజానికి 2003 వరల్డ్ కప్ లో ఇండియా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఆ వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఫైనల్‌ వరకు వెళ్లినా.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై తిరుగులేని రికార్డు ఉన్న లక్ష్మణ్‌ టీమ్‌లో ఉంటే బాగుండేదని అప్పట్లో అనుకోని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఇక వరల్డ్‌ కప్‌లో తర్వాత కూడా లక్ష్మన్‌ టీమ్‌లో చోటు సాధించాడు. మళ్లీ అదే ఫామ్‌ను కొనసాగించి.. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియాపై సెంచరీలు సాధించాడు. ఇలా వరల్డ్‌ కప్‌కు ముందు.. వరల్డ్‌ కప్‌ తర్వాత భీకర ఫామ్‌లో ఉన్న లక్ష్మణ్‌.. వరల్డ్‌ కప్‌లో లేడు. అందుకు ప్రధాన కారణం అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీనే అని క్రికెట్‌ పండితులు సైతం చెబుతున్నారు. లక్ష్మణ్‌ స్థానంలో మోంగియాను తీసుకోవాలనే దాదా నిర్ణయం.. వరల్డ్‌ కప్‌ ఆడాలనే వీవీఎస్‌ లక్ష్మణ్‌ కలను కలలానే మిగల్చడంతోపాటు.. 2003 వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఒక అద్భుతమైన ఆటగాడిని దూరం చేసింది.