iDreamPost
android-app
ios-app

అతనికి అంత సీన్‌ లేదు.. రోహిత్‌ ఇరగదీస్తాడు: గంగూలీ

  • Published Sep 01, 2023 | 1:12 PM Updated Updated Sep 01, 2023 | 1:12 PM
  • Published Sep 01, 2023 | 1:12 PMUpdated Sep 01, 2023 | 1:12 PM
అతనికి అంత సీన్‌ లేదు.. రోహిత్‌ ఇరగదీస్తాడు: గంగూలీ

ఆసియా కప్‌ 2023లో హైఓల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్‌ టోర్నీ మొత్తానికే ఈ మ్యాచ్‌ హైలెట్‌గా నిలువనుంది. అనుకున్నట్లు జరిగితే.. ఇదే టోర్నీలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మరో రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే.. రేపు జరగనున్న మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్షం రావచ్చన్న భయం ఉన్నా కూడా.. కానీ, వరుణుడు కరుణించి మ్యాచ్‌ జరుగుతుందన్న ఆశ కూడా క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కనుక కచ్చితంగా జరగాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనగానే.. ఇరు జట్ల బలాబలాలపై క్రికెట్‌ అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ చాలా పటిష్టంగా ఉందని, టీమిండియా బ్యాటర్లకు ఇదే అతిపెద్ద సవాల్‌ అనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ టీమిండియాకు ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్నట్లు క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందుకు 2021 టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అఫ్రిదీ వేసిన బౌలింగ్‌ గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ మ్యాచ్‌లో అఫ్రిదీ టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మతో పాటు హాఫ్‌ సెంచరీతో రాణించిన కోహ్లీని సైతం అతనే అవుట్‌ చేశాడు.

కానీ, టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో మాత్రం కోహ్లీ ముందు పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ నిలువలేకపోయింది. అయినా కూడా ఈ ఆసియా కప్‌లో షాహీన్‌ షా అఫ్రిదీ ప్రమాదకరమైన బౌలర్‌ అని ముఖ్య​ంగా రోహిత్‌ శర్మ అతని బౌలింగ్‌ బాగా ఇబ్బంది పడుతున్నాడంటూ చాలా మంది చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌, బీసీసీఐ మాజీ ఛైర్మన్‌ సౌరవ్‌ గంగూలీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి బౌలర్లు ఉండటం సహజమని, షాహీన్‌ అఫ్రిదీ మంచి బౌలరే అయినప్పటికీ.. మరీ అంతగా ఎక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని కొట్టిపారేశాడు. రోహిత్‌ శర్మ కూడా అతన్ని ఎదుర్కొడానికి సిద్ధం అవుతాడని, ఈ సారి రోహిత్‌ అదరగొడతాడని గంగూలీ పేర్కొన్నాడు. మరి గంగూలీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Asia Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!