Nidhan
అభిమానం అంటే బ్యానర్లు కట్టడం, సోషల్ మీడియాలో పొగుడుతూ పోస్ట్లు పెట్టడం కాదు. ఆరాధించే వారిని స్ఫూర్తిగా తీసుకొని లైఫ్లో అనుకున్న గోల్ రీచ్ అవ్వడం అని గంగూలీ అభిమాని ఒకరు నిరూపించారు.
అభిమానం అంటే బ్యానర్లు కట్టడం, సోషల్ మీడియాలో పొగుడుతూ పోస్ట్లు పెట్టడం కాదు. ఆరాధించే వారిని స్ఫూర్తిగా తీసుకొని లైఫ్లో అనుకున్న గోల్ రీచ్ అవ్వడం అని గంగూలీ అభిమాని ఒకరు నిరూపించారు.
Nidhan
అభిమానం.. ఒక మనిషిని ఉన్మాద స్థితికి తీసుకుపోతుంది. ముఖ్యంగా వ్యక్తి పూజ జీవితానికే ప్రమాదం. అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే! నిజమైన అభిమానం జీవితాన్ని అందంగా, అద్భుతంగా మార్చగలదు. మదిలో కసిని రగిలించి, విజయం వైపు ప్రయాణింపచేసి విజేతగా నిలపగలదు. అలాంటి ఓ నిజమైన అభిమానం, అభిమాని గురించే ఇప్పుడు మనం తెలుకోబోతున్నాం. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బెనర్జీ. కోల్‌కతాలో నివాసం. మిగతా అందరు యువకుల్లానే క్రికెట్ అంటే పిచ్చి. రాయల్ బెంగాల్ టైగర్, ఇండియన్ క్రికెట్కు దాదా సౌరవ్ గంగూలీ అంటే బెనర్జీకి అభిమానం. కొన్నాళ్ళకి ఆ అభిమానం ఇంకా పెరిగిపోయి.. ఉన్మాదం స్థాయికి వెళ్లిపోయింది. బెనర్జీ చివరికి తన పేరుకి ముందు అధికారికంగా గంగూలియన్ అని యాడ్ చేసుకున్నాడు అంటే ఆ ఇష్టం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. బెనర్జీ ఆ అభిమానాన్ని పాజిటివ్ సైడ్ ట్రాక్ మళ్ళించాడు. తన ఆరాధ్య క్రికెటర్ స్ఫూర్తితో జీవితంలో విజేతగా నిలిచాడు.
బెనర్జీ ముందుగా ఓ యావరేజ్ స్టూడెంట్. అయితే.. తనకి గంగూలీ ఆట తప్ప వేరే లోకం తెలియదు. కానీ.. కొన్నాళ్ళకి గంగూలీ క్రికెట్ నుండి రిటైర్డ్ అయిపోయాడు. బెనర్జీ కూడా మ్యాచ్ లు చూడటం తగ్గించేశాడు. దాదా తర్వాత తరం మారిపోయింది. ధోని, కోహ్లీ, రోహిత్ వంటి స్టార్స్ పుట్టుకొచ్చారు. ఆటలో వేగం పెరిగింది. కాలం ఆ స్టార్స్ ని లెజండ్స్ గా మార్చేసి ముందుకి వెళ్లిపోయింది. కానీ.. బెనర్జీ మాత్రం గంగూలీ దగ్గర, దాదా ఆట దగ్గర ఆగిపోయాడు. ఇప్పుడు అతనికి ఆటపై ఇష్టం పోయింది. ఏం చేయాలో తెలియని స్థితిలో గంగూలీ జీవితాన్ని, కెరీర్ ని నిదానంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. పుట్టుకతో రాయల్ ఫ్యామిలీ.. ఈడెన్ లో తొలి సెంచరీ, కుర్రాడిగా సృష్టించిన అద్భుతాలు, టీమ్ ఫిక్సింగ్ కోరల్లో చిక్కి.. పాతాళానికి పడిపోయిన క్షణాన కెప్టెన్సీ చేపట్టిన మూమెంట్స్, కెప్టెన్గా టీమిండియాలో స్తైర్యాన్ని నింపిన తీరు, జట్టుకి విజయాలను అలవాటు చేసిన విధానం.. ఇలా ఒక్కటేంటి, గంగూలీ కష్టం, కమిట్మెంట్, స్థాయి అర్థం చేసుకున్నాక.. బెనర్జీ ఆలోచనల్లో మార్పు వచ్చింది.
అభిమాన క్రికెటర్ గంగూలీలాగే తాను కూడా కష్టపడాలని బెనర్జీ నిర్ణయించుకున్నాడు. పోలీస్ అవ్వాలన్న టార్గెట్ ముందు పెట్టుకున్నాడు. ఇందుకోసం అహర్నిశలు శ్రమించాడు. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు, కష్టపడి విజేత అవ్వడానికి, శక్తికి మించిన యుద్ధమే చేశాడు. ఈ మొత్తం ప్రయాణంలో గంగూలీ ఏకలవ్య శిష్యరికమే అతనికి డ్రైవింగ్ ఫోర్స్ అయ్యింది. మొత్తానికి బెనర్జీ ఆ ప్రయాణంలో సక్సెస్ అయ్యాడు. చివరికి కోల్‌కతాలోని ఓ పోలీస్ స్టేషన్ లో SIగా విధుల్లో చేరాడు. అధికారి అయ్యాక కూడా అతనికి గంగూలీ అంటేనే ప్రాణం. తన గురువుకి తన జర్నీ గురించి చెప్పడానికి ఓ రోజున దాదాను వెళ్లి కలిశాడు. ఓ అభిమానిని ఇంతలా తాను ప్రభావితం చేసినందుకు గంగూలీ కూడా బాగా ఆనందపడ్డాడు. ప్రస్తుతం దాదా అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మనం ఎంతలా అభిమానిస్తున్నాం అన్నది కాదు, ఎలాంటి వ్యక్తిని అభిమానిస్తున్నాం అన్నదే ముఖ్యం. గంగూలీ లాంటి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని అభిమానించడంతో.. ఈరోజు లైఫ్ లో బెనర్జీ సెటిల్ అయ్యాడు. మరి.. ఈ మొత్తం అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.